📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Britain: ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బ్రిటన్ జాతీయుడు

Author Icon By Sharanya
Updated: June 13, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌లో (Ahmedabad) జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మరణించారు. కానీ అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి బ్రిటన్‌కు చెందిన భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ (39). అతని సాహసికత, అదృష్టం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ప్రమాద సమయంలో అసాధ్యాన్ని సాధ్యమైనదిగా చేసిన విజయం

ఘోర విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకైక సర్వైవర్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ (39) గా గుర్తించారు. వడవడిగా అడుగులేస్తూ తనకు తానే వచ్చి ఆంబులెన్స్ ఎక్కాడు మృత్యుంజయుడు. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తోన్న మొత్తం 242మందిలో 241మంది చనిపోయారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన స్థితిలో మృతదేహాలున్నాయి. విమానం కూలిన విధానం కూలగానే భారీ విస్పోటనం కూలిన భారీ బిల్డింగ్అ లుముకున్న దట్టమైన పొగ ఈ సిట్చువేషన్స్‌ చూసి ఎవరూ బతికి బట్టకట్టలేరని అందరూ భావించారు. గాయాలతో హాస్పిటల్‌లో చేరినవారంతా మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్ధులు, సిబ్బంది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో విశ్వాస్ చిన్న చిన్న గాయాలతో బయటపడటం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

విశ్వాస్ కూర్చున్న సీటు — ప్రమాద సమయంలో అతనికి అదృష్టంగా మారింది

విశ్వాస్ 11A సీటులో కూర్చున్నాడు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో సీటింగ్ లేఅవుట్ చూస్తే..11Aసీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ విండో కాదు. ఎగ్జిట్ విండోకు కాస్త దూరంగా ఉంటుంది. మామూలుగా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో ఎకానమీ క్లాస్‌లో 2-3-2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ లేఅవుట్‌లో ఒక్కో వరుసలో రెండు విండో సీట్లు అంటే ఎడమవైపు A, B; కుడివైపు J, K, మధ్యలో మూడు సీట్లు D, E, F ఉంటాయి. ఇప్పుడు విశ్వాస్ కూర్చున్న 11A సీటు ఎడమవైపు విండో సీటు, రెండు సీట్ల గ్రూప్‌లో బయటి వైపున ఉంటుంది. ఈ సీటు విమానం ముందు భాగంలో, రెక్కలకు కొంత ముందు ఉంటుంది. 11A సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు కాదు, ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లు రెక్కల దగ్గర ఉంటాయి. అంటే 19వ వరుస వద్ద ఉంటాయి. విమానంలో ఓవర్‌వింగ్ ఎగ్జిట్‌లు 19A, 19K సీట్ల వద్ద ఉన్నాయి. ఈ ఎగ్జిట్‌లు విమానం ఎడమ, కుడి వైపులా ఉంటాయి, ప్రతి ఎగ్జిట్ వద్ద ఒక విండో ఉంటుంది.

11A సీటు నుంచి 19A సీటు వద్ద ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు దూరం సుమారు 8 వరుసలు, అంటే దాదాపు 6-8 మీటర్లు. 11A సీటు విమానం ముందు భాగంలో ఉండటం వల్ల, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. విశ్వాస్ ఎమర్జెన్సీ గేట్‌ను తెరిచుకుని బయటకు వచ్చాడని కొందరు చెబుతున్నారు. కానీ ఇది సాధ్యమా అన్నది కొందరి ప్రశ్న. ఎందుకంటే విమానం కూలిన విధానం బయటకు దూకే అవకాశం కూడా లేని విధంగా ఉంది.అందుకే రమేష్ ఎలా తప్పించుకున్నాడన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు రెక్కల దగ్గర ఉండటం వల్ల, విమానం కూలిన తర్వాత రమేష్ వెంటనే క్యాబిన్ లేఅవుట్ గురించి అవగాహన ఉండి త్వరగా బయటపడి ఉండొచ్చు.

కుటుంబ విషాదం — సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు

ఈ ప్రమాదంలో విశ్వాస్ సోదరుడు దుర్మరణం చెందాడు. గుజరాత్‌లోని తన కుటుంబాన్ని కలవడానికి బ్రిటన్ నుంచి వచ్చిన విశ్వాస్‌ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు.

బ్రిటన్ జాతీయుడి అద్భుతమైన క్షేమతలం

ఈ ఘోర ప్రమాదంలో విశ్వాస్ ప్రాణాలతో బయటపడటం ఒక అపూర్వమైన సంఘటనగా నిలిచింది. విమాన ప్రమాదాల చరిత్రలో ఇంతటి ఘోరమైన ఘటన నుంచి ఏకైక వ్యక్తి బయటపడటం అరుదైనది.

Read also: Flight Crash: ఆనంద కుటుంబం కాస్త అగ్నికి ఆహుతి

#AhmedabadCrash #AirIndiaAccident #BritishCitizen #Flightaccident #PlaneCrash #VishwasKumarRamesh Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.