📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Britain: జాతి వివక్షతో భారతీయు యువతిపై అత్యాచారం

Author Icon By Pooja
Updated: October 27, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖండాలు ఏవైనా.. దేశాలు ఎన్నైనా మహిళలకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఆకాశంలో సగభాగం మాదే అంటూ, నింగీనేలా తనదేలా భావిస్తూ, తన కెరీర్ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులతో ఎంతో ఎదుగుతూ, దేశాభివృద్ధికి, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నా..మహిళ అనేసరికి ఆమెను లైంగిక అవసరాలను తీర్చేసాధనంగానే భావిస్తున్నారు. ఆమె అభివృద్ధిని అడ్డుకునే రాక్షసకీడలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. అందుకే పసిబిడ్డల నుంచి, వృద్ధుల వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధుల భారీ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. తాజాగా బ్రిటన్(Britain) లో భారత సంతతికి చెందిన ఇరవై ఏళ్ల మహిళపై లైంగిక దాడి జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: Delhi Crime: కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది

Britain: జాతి వివక్షతో భారతీయు యువతిపై అత్యాచారం

‘జాతి వివక్ష దాడి’గా పేర్కొన్న పోలీసులు

ఉత్తర ఇంగ్లండ్(Britain) లోని వాల్ సాల్ ప్రాంతంలో శ్వేతజాతీయుడైన ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని ‘జాతి వివక్ష దాడి’గా పరిగణిస్తున్న వెస్ట్ మిడ్ లాండ్స్(West Midlands) పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుడి సీసీటీవీ పుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. ఒక మహిళపై లైంగిక దాడి జరగడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై వీధీ మధ్యలో కూర్చున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే వాల్సాల్ లోని పార్క్ల్ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, వెస్ట్ మిడ్ ల్యాండ్స్ పోలీసులు నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు నిందితుడి ఫోటోను విడుదల చేశారు పోలీసులు.

దాడిచేసిన వ్యక్తి శ్వేతజాతీయుడు

కాగా దాడికి పాల్పడిన వ్యక్తి 30 ఏళ్ల వయసున్న శ్వేతజాతీయుడని, పొట్టి జుట్టుతో, నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి వివరాలు అధికారికంగా పోలీసులు ప్రకటించనప్పటికీ, ఆమె పంజాబ్ కు చెందిన యువతి అని స్థానిక కమ్యూనిటీ గ్రూపులు పేర్కొంటున్నాయి. సమీపంలోని ఓల్డ్బరీ ప్రాంతంలో నెల రోజుల క్రితం సిక్కు మహిళపై ఇలాంటి జాతి వివక్ష అత్యాచార ఘటనే జరగడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడి వల్ల సమాజంలో నెలకొన్న భయాందోళనలను తాము అర్థం చేసుకోగలమని వాల్ సాల్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఫిల్ డోల్చీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో పోలీసుల పహారా పెంచుతామని హామీ ఇచ్చారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

IndianWoman Latest News in Telugu RacialAbuse Today news UKNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.