📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Britain: ఎపిస్టీన్ ఫైల్స్.. రాయల్ టైటిల్ ను వదులుకున్న ప్రిన్స్ ఆండ్రూ

Author Icon By Sushmitha
Updated: October 31, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతకొంత కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎపిస్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేస్తున్న సంగతి విధితమే. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మస్క్ తో సహా చాలామంది పేర్లు బయటకు రావడంతో ఈ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా బ్రిటన్(Britain) యువరాజు ఆండ్రూ(Prince Andrew) పేరు కూడా వినిపించింది. ఈయన  పేరు బయటకు రావడంతో ఆయన తన రాయల్ టైటిల్ ను వదులుకున్నారు. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 తన సోదరుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న బిరుదులు అన్నింటినీ తొలగించడమే కాకుండా.. అతన్ని ప్యాలెస్ నుంచి కూడా బయటకు పంపించేశారని తెలుస్తోంది. బకింగ్ హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ప్రకటించింది.

Read Also: TG SET-2025: దరఖాస్తు గడువు పొడిగింపు – నవంబర్ 6వరకు అవకాశం

కాస్త మరక అంటినా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందే..

బ్రిటన్ లో రాజులకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో ఇంకా రాజరిక వ్యవస్థ కొనసాగుతున్నంది. అందుకే వీరు చాలా పద్ధతిగా ఉంటారు. ఏ కాస్త మరక అంటకుండా నిత్యం తమనుతాము కాపాడుకుంటారు. దివంగత రాణి ఎలిజిబెత్ రెండో కుమారుడు, చార్లెస్తమ్ముడూ ఆండ్రూ, ఎపిస్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు బయటకు వచ్చినప్పటి నుంచీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ వదులుకున్నారు. ఇప్పుడు రాజు చార్లెస్ తన తమ్ముడిపై చర్య తీసుకున్నారు. ఆండ్రూకు ఉన్న బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారు.

అంతేకాకుండా ఆండ్రూ ప్రస్తుతం లీజుకు తీసుకుని ఉంటున్న లండన్ లోని విండ్సర్ ఎస్టేట్ ను కూడా ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపించారు. దీంతో ఆండ్రూ తూర్పు ఇంగ్లండ్ లోని సాండ్రిగ్ హోమ్ ప్రైవేట్ ఎస్టేట్ లోకి మారతారని బకింగ్ హామ్ ప్యాలెస్ పేర్కొంది. అయితే ఆండ్రూ తనపై వచ్చిన ఆరోపణలను చాలాసార్లు తిరస్కరించారు. అయినా కూడా రాజుగా చార్లెస్ తన విధులను నిర్వర్తించాలని భావించడం వల్లనే ఆండ్రూపై చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Epstein Files Google News in Telugu Jeffrey Epstein Latest News in Telugu Prince Andrew Royal title scandal Telugu News Today UK royal family

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.