📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

BRICS: ట్రంప్‌కు భారీ షాకిచ్చిన బ్రిక్స్ దేశాలు.. ఏకమైన ప్రపంచాధినేతలు

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాలతో మళ్లీ ట్రేడ్ వార్ కు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ట్రంప్ సుంకాలన్నీ బ్రిక్స్ దేశాలు (BRICS) టార్గెట్ గా ఉన్నాయి. బ్రిక్స్ దేశాలపై భారీ స్థాయిలు సుంకాలను విధించారు.బ్రెజిల్, భారతదేశం వంటి దేశాలపై 50 శాతం టారిఫ్ విధిస్తూ కీలక నిర్ఱయం తీసుకున్నారు. ఈ దేశాలు రష్యా చమురు కొనుగోళ్లు ఆపడం లేదని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. గతంలోనే భారత్ మీద 25 శాతం సుంకాలు విధించి వైట్ హైస్ (White House) తాజాగా ఇండియా నుండి అమెరికాకు వచ్చే వస్తువులపై అదనంగా 5% సుంకాన్ని విధిస్తున్నట్లు ఉత్తర్వు జారీ చేసింది. దీంతో భారత్ మీద వేసిన సుంకాలు 50 శాతానికి చేరాయి.

BRICS: ట్రంప్‌కు భారీ షాకిచ్చిన బ్రిక్స్ దేశాలు.. ఏకమైన ప్రపంచాధినేతలు

BRICS దేశాల మధ్య ట్రంప్ కు పెరుగుతున్న దూరం
ఇక మరో BRICS దేశం బ్రెజిల్ నుంచి దిగుమతులపై కూడా డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను అమలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ ఆప్త మిత్రుడు జైర్ బోల్సోనారోపై జరుగుతున్న విచారణలపై వ్యతిరేకత అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ చర్యలు BRICS దేశాల మధ్య ఆయనకు దూరాన్నిపెంచాయి. BRICS దేశాల మధ్య సంబంధాలు చిగురించేదుంకు దోహదపడుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా సుంకాల దాడులు BRICS దేశాల మధ్య ఐక్యతకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత చైనాను సందర్శించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య గల ఉద్రిక్తతలను చల్చార్చే అవకాశం ఉంది. అదే సమయంలో.. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ట్రంప్ అదనపు సుంకాలపై ఉమ్మడి స్పందన కోసం చర్చించేందుకు భారతదేశం, చైనా నాయకులను పిలవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
BRICS దేశాలు తాత్కాలికంగా ఏకమయ్యే అవకాశం
అయితే.. BRICS అంతర్గతంగా చాలావరకు విభిన్న స్వభావం కలిగిన దేశాల సముదాయంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా చూసుకున్నట్లయితే వీరి వాణిజ్య పరస్పర సంబంధాలు బలహీనంగా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే చైనా ఎగుమతులలో BRICS దేశాల వాటా కేవలం 9 శాతం మాత్రమే, ఇది US 15 శాతం వాటాగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆసియాతో పోల్చితే తక్కువే కూడా చైనా వాటా తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఇటీవల చైనా-రష్యా మధ్య వాణిజ్యం 244.8 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం. ట్రంప్ టారిఫ్ దూకుడుతో BRICS దేశాలు తాత్కాలికంగా ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ వాణిజ్య కూటముల ఐక్యతకు నాంది

ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, కరెన్సీ వినియోగం రంగాలలో ఈ దేశాలన్నీ కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో దీర్ఘకాలికంగా చైనా ఆధిపత్యాన్ని భారతదేశం అంగీకరించదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ట్రంప్ విధిస్తున్న సుంకాలు BRICS దేశాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల.. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థానాన్ని సమర్థించుకునేందుకు పరస్పర మద్దతుతో ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా ప్రపంచ వాణిజ్య కూటముల ఐక్యతకు నాంది కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్రిక్స్ 2025 వికీపీడియాలో కొత్త సభ్యులు ఎవరు?
జనవరి 6, 2025న, ఇండోనేషియా అధికారికంగా బ్రిక్స్‌లో పూర్తి సభ్యుడిగా చేరింది, దీనితో ఇది బ్రిక్స్ కూటమిలో చేరిన మొదటి ఆగ్నేయాసియా రాష్ట్రంగా, అలాగే బ్రిక్స్‌లో 11వ సభ్యదేశంగా నిలిచింది.

BRICS 2025 కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
బ్రెజిల్ రియో డి జనీరోలో 17వ BRICS శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది ...
2025 BRICS శిఖరాగ్ర సమావేశాన్ని బ్రెజిల్ రియో డి జనీరోలో నిర్వహిస్తుంది. ఈ శిఖరాగ్ర సమావేశం జూలై 6-7 తేదీలలో జరగనుంది. 2025 శిఖరాగ్ర సమావేశానికి ఇతివృత్తం "మరింత సమగ్రమైన మరియు స్థిరమైన పాలన కోసం ప్రపంచ దక్షిణ సహకారాన్ని బలోపేతం చేయడం" అని ప్రభుత్వ పత్రికా ప్రకటనలో తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rice-telangana-rice-exports-to-the-philippines-surge/international/527345/

BRICS alliance Brics Summit Geopolitics Global leadership Latest News Breaking News Telugu News Trump vs BRICS US dominance challenged World order shift

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.