📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బ్రియాన్ లారా తీవ్ర ఆగ్రహం

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెస్టిండీస్ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (CWI) పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 29 ఏళ్ల వయసులోనే నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం, ఈ బోర్డు పాలన వైఫల్యానికి నిదర్శనమని లారా అన్నారు. అతని ప్రకటన వెస్టిండీస్ క్రికెట్‌కు ఒక హెచ్చరికగా మారిందని, ఈ పరిస్థితికి కారణమైన బోర్డు తక్షణమే మారాలని ఆయన స్పష్టం చేశారు.లారా (“Stick to Cricket”) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, “నేటి ఆటగాళ్లు తమ భవిష్యత్తు, ఆర్థిక భద్రత కోసం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, నికోలస్ పూరన్ లాంటి యువ, ధీటైన ఆటగాడు అంత తొందరగా రిటైర్ అవుతాడంటే, అది వ్యవస్థలో లోపం ఉన్నదనే సంకేతం,” అని వ్యాఖ్యానించారు.ప్రతిభ కలిగిన ఆటగాళ్లను దేశం కోసం ఆడేలా చేయడంలో బోర్డు పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులను చూసైనా నేర్చుకోవాలని అన్నారు.

Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బ్రియాన్ లారా తీవ్ర ఆగ్రహం

ఇలాంటి నిర్ణయాలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐదు, ఆరు లీగ్ లు ఉన్నాయని ఇవి తమ ఆటగాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నాయని చెప్పారు. ఆటగాళ్లు జాతీయ జట్టులో కొనసాగేందుకు విండీస్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తమ కుటుంబాల కోసమే క్రికెటర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా బోర్డు మేల్కొనాలని హితవు పలికారు.నికోలస్ పూరన్ (Nicholas Pooran) రిటైర్మెంట్ వెస్టిండీస్ క్రికెట్‌కు బిగ్ అలారమ్. బ్రియాన్ లారా (Brian Lara) చేసిన విమర్శలు బోర్డుకు ఓ క్లియర్ వార్నింగ్. సీడబ్ల్యూఐ బోర్డు తక్షణమే మారని పక్షంలో, వెస్టిండీస్ క్రికెట్ మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పుడు నిబద్ధత, వ్యూహాలు, మార్గదర్శకత అవసరం.

బ్రియాన్ లారా ఎవరు?

బ్రియాన్ లారా వెస్టిండీస్‌కు చెందిన మాజీ క్రికెట్ దిగ్గజం. అతడు ఓ ఎడమచేతి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ క్రికెట్‌లో తనదైన స్థానం ఏర్పరుచుకున్నాడు.

లారా స్పెషాలిటీ ఏమిటి?

లారా అత్యద్భుతమైన టెక్నిక్ కలిగిన ఎడమచేతి బ్యాట్స్‌మన్. అతను టెస్ట్ క్రికెట్‌లోనూ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట..ప్రభుత్వ రిపోర్ట్ బయటపెట్టిన హైకోర్టు

Brian Lara Criticism CWI Failure IPL 2025 impact Nicholas Pooran Retirement Pooran IPL Salary T20 League vs National Team West Indies Cricket Board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.