📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Breaking News: ట్రంప్ పై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నం ?

Author Icon By Sharanya
Updated: July 10, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితంగా ఉన్న సీనియర్ సలహాదారు జవాద్ లారిజానీ, ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై (Donald Trump) హత్యా బెదిరింపులతో సంచలనం రేపారు. ఆయన ప్రకారం, ట్రంప్ విలాసవంతమైన నివాసమైన మార్-ఎ-లాగో వద్ద సన్ బాత్ చేస్తుండగా ఆయన్ను కాల్చి చంపవచ్చని హెచ్చరించారు. “అతన్ని చంపడం చాలా సులభం,” అంటూ వ్యాఖ్యానించారు.

బ్లడ్ పాక్ట్ వెబ్‌సైట్ – ప్రతీకారానికి నిధుల సమీకరణ

ఈ ప్రకటనల వెనుక, ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ ఖమేనీ అవమానించే లేదా ప్రణాలకు ముప్పు కలిగించే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బ్లడ్ పాక్ట్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ పెట్టారు. దీనిలో వారు నిధులను సేకరిస్తున్నారు. వెబ్‌సైట్ ఇప్పటివరకు $27 మిలియన్లకు పైగా వసూలు చేసిందని మరియు $100 మిలియన్లను చేరుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఈ వెబ్ సైట్ లోనే ట్రంప్ (Donald Trump) ను డ్రోన్ తో చంపేస్తామంటూ ప్రకటన వచ్చింది.

ఫార్స్ న్యూస్ ధృవీకరణ – మత సంస్థలకు పిలుపు

మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌తో అనుబంధంగా ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కూడా దీనిని ధృవీకరించింది. దాంతో పాటూ పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు, నగర కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలని మత సమూహాలకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహులకు ‘మొహరేబెహ్’ (Moharebeh) వంటి ఇస్లామిక్ చట్టాలను వర్తింపజేయాలంది.

ఇరాన్ ప్రభుత్వం – స్పందన

ఈ ఘటనలపై ఇరాన్ తాజా అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ, ఈ ప్రకటనలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. “ఇవి వ్యక్తిగత అభిప్రాయాలు, అధికారిక ప్రభుత్వ విధానంతో సంబంధం లేదు” అని పేర్కొన్నారు.

ట్రంప్ కౌంటర్ స్పందన – వ్యంగ్యపు జవాబు

జవాద్ లారిజాని ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఇది తీవ్రంగా పరిగణించవలసిన విషయమని అన్నారు. తాము జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అయితే తాను సన్ బాత్ చేయనని అదంటే తనకు చాలా చిరాకని ట్రంప్ చెప్పారు. తాను చివరిసారిగా తనకు 7ఏళ్ళు ఉన్నప్పుడు చేశానని చెప్పుకొచ్చారు .

ఇటీవల ఇరాన్ నుండి వచ్చిన బెదిరింపు వివాదం ఏమిటి?


ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు జవాద్ లారిజాని ట్రంప్‌ను డ్రోన్ దాడి ద్వారా చంపాలని బహిరంగంగా ప్రకటించడం, ట్రంప్ పై బ్లడ్ పాక్ట్ వెబ్‌సైట్‌ ద్వారా నిధులు సేకరించడంపై పెద్ద వివాదం రేగింది.

Read hindi news: hindi.vaartha.com

read also: Israel-Hamas War: గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ 40 మంది మృతి

BloodPactWebsite Breaking News DonaldTrump DroneThreat IranDroneAttack JavadLarijani Telugu News TrumpVsIran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.