ఈమధ్య కాలంలో విమాన ప్రయాణాలు పెరిగిన తరుణంలో, విమాన ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఆధునిక సాంకేతికత ఉన్నా, కొన్ని కారణాల వల్ల విమానాలు, హెలికాప్టర్లు కుప్పకూలటం మనం తరచూ చూస్తున్నాం. ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 265 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ ఘటన వార్తల్లో హైలైట్ అవుతూనే ఉంది.ఇదే తరహాలో తాజాగా ఘనా (Ghana) దేశంలో ఘోరమైన సైనిక హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. వివరాల్లోకి వెళ్తే, ఆగస్టు 6, బుధవారం ఉదయం జెడ్-9 యుటిలిటీ మిలిటరీ హెలికాప్టర్, ఘనా రాజధాని అక్ర నుంచి ఒబువాసి నగరానికి బయలుదేరింది. సాధారణంగా ఇది ఒక సురక్షిత ప్రయాణ మార్గం. కానీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధం కోల్పోయింది.
పలువురు ఉన్నతాధికారులు
హెలికాప్టర్ గాలిలో కదిలే సమయంలోనే ఎటూ లేని విధంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అప్పటికే అప్రమత్తమైన అధికారులకి కన్సిస్టెంట్ కమ్యూనికేషన్ లేకపోవడంతో హెలికాప్టర్ కుప్పకూలిన విషయం అర్ధం అయ్యింది. కొద్దిసేపటిలోనే ఘోరమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఘనా దేశ డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఒమానే బోమాతో పాటుగా ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. హెలికాప్టర్ కుప్ప కూలిన సమయంలో దానిలో ఇద్దరు కేబినెట్ మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ధాటికి హెలికాప్టర్ (Helicopter) లో ప్రయాణం చేస్తున్న వారంతా చనిపోయారని ఘనా దేశం ప్రకటించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి.
అత్యంత భయానక విమాన ప్రమాదాలలో ఇదొకటని
యుద్ధప్రాతిపదిక సహయక చర్యలు మొదలుపెట్టాయి. మృతదేహాలను వెలికి తీసి, ఆస్పత్రికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.హెలికాప్టర్ కుప్ప కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని.. నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘన ప్రభుత్వం హెలికాప్టర్ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ప్రకటించింది.దశాబ్ద కాలంలో ఘనాలో చోటు చేసుకున్న అత్యంత భయానక విమాన ప్రమాదాలలో ఇదొకటని అధికారులు తెలిపారు. 2014లో తీరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మరణించగా, 2021లో రాజధాని అక్రాలో ఒక కార్గో విమానం రన్‌వేను దాటి ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో 10 మంది మరణించారని వెల్లడించారు. ఇక తాజాగా సైనిక హెలికాప్టర్ కూలి ఇద్దరు కేంద్ర మంత్రులు సహా మొత్తం 8 మంది చనిపోయారు.
ఘానా రాజధాని ఏది?
ఘానా రాజధాని నగరం “అక్రా (Accra)”.
ఘానా అధికారిక భాష ఏమిటి?
ఘానాలో అధికారిక భాష “ఇంగ్లీష్”. అయితే అక్కడ ఎన్నో స్థానిక భాషలు కూడా మాట్లాడతారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: