హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం (Trump’s government)విధించిన నిషేధంపై, స్థానిక కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా హార్వర్డ్(Harvard)లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు (International students)తమ విద్యా కార్యక్రమాలను కొనసాగించగలుగుతున్నారు.
గట్టి ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక వలసదారులతో పాటు విదేశీ విద్యార్దులపై దూకుడు ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇవాళ మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా విదేశీ విద్యార్ధులకు స్వర్గధామంగా భావించే హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలకు ఇవాళ స్థానిక కోర్టు బ్రేక్ వేసింది. ఈ మేరకు ఫెడరల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హార్వర్డ్ యూనివర్శిటీలోకి విదేశీ విద్యార్ధులు చేరకుండా చేసేందుకు ట్రంప్ సర్కార్ విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ వర్శిటీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ట్రంప్ సర్కార్ తో హార్వర్డ్ వర్సిటీ సాగిస్తున్న న్యాయపోరాటంలో గొప్ప ఊరట దక్కినట్లు భావిస్తున్నారు.
ట్రంప్ సర్కార్ ఆదేశాలు అమల్లోకి వస్తే హార్వర్డ్ యూనివర్శిటీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో సదరు ఉత్తర్వులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. హార్డర్డ్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థుల నమోదును నిలిపివేయాలని ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ మే 23న ఇచ్చిన ఉత్తర్వుల్ని హార్డర్డ్ సవరించింది. ఇప్పుడు కోర్టు ఉత్తర్వు కూడా హార్డర్డ్ కు అనుకూలంగా రావడంతో ట్రంప్ సర్కార్ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also:Tharoor: పాక్ తో చర్చలు ఉండవు : శశిథరూర్