
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని.. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అయితే తాజా ప్రెస్‌మీట్‌లో ఆయన (Rahul Gandhi) బ్రెజిల్ మోడల్ లారిసా నెరీ (Brazilian model Larisa Neri) ఫొటోను ప్రదర్శించడంపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.
Read Also: UP: షభాష్ పోలీస్..రెప్పపాటులో బాలికను కాపాడారు..
లారిసా పాత ఫొటోను ఉపయోగించి 22 నకిలీ ఓట్లను సృష్టించారని.. దీన్ని ఎన్నికల సంఘం ఎందుకు గుర్తించలేకపోయిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇక ఇదే విషయంపై బ్రెజిల్ మోడల్ లారిసా స్పందించారు.
ఈ సందర్భంగా లారిస్సా తన వీడియోలో మాట్లాడుతూ.. “హలో ఇండియా, భారతీయ జర్నలిస్టులు నన్ను అడగడంతో ఈ వీడియో చేస్తున్నాను. నాకు భారత రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. నేను ఎప్పుడూ భారతదేశానికి కూడా రాలేదు. నేను బ్రెజిల్‌కు చెందిన మాజీ మోడల్‌ని, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని.
నాకు భారత ప్రజలంటే చాలా ఇష్టం
నాకు భారత ప్రజలంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా సీరియస్‌గా మారింది. జర్నలిస్టులు నా గురించి వెతుకుతున్నారు, ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నారు. నేను ఇప్పుడు మోడలింగ్ కూడా చేయడం లేదు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను” అని వివరించారు.
ప్రస్తుతం మోడలింగ్ వృత్తికి దూరంగా ఉన్న లారిస్సా, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన ప్రమేయం లేకుండా భారత రాజకీయ వివాదంలోకి తనను లాగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: