📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Brazil: సింహాన్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాడు.. ప్రాణాలనే కోల్పోయాడు

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్నిసార్లు చిన్ని కోరిక పెద్ద నష్టానికి కారణం కావచ్చు. ఓ నిర్ణయాన్ని తీసుకునేముందు దాని పర్యవసానాలను కూడా అంచనా వేయగల్గాలి. లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లితుంది. సరిగ్గా ఓ యువకుడి విషయంలో ఇదే జరిగింది. బ్రెజిల్ లో (Brazil) ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక ఓ యువకుడి ప్రాణాలనే తీసింది. స్థానికులను ఉలిక్కిపడేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా భారీ నిరసనలకు పిలుపు

Brazil He wanted to see a lion up close… and lost his life

నేరుగా బోనులోకి దిగాడు..

బ్రెజిల్ లోని అరుడా కామరా జూపార్క్ లో (Zoopark) ఓ యువకుడు సింహాన్ని మరింత దగ్గరగా చూడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో బోను పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా బోనులోకి దిగాడు. యువకుడి కదలికలను గమనించిన సింహం కొన్ని క్షణాల్లోనే అతడి వద్దకు చేరుకుంది. సింహం (lion) ఆ యువకుడిని పొదల వైపు లాక్కెళ్లి దాడి చేసింది. జూ సిబ్బంది స్పందించేలోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటన తీవ్రంగా ఉండటంతో అక్కడి సందర్శకులు, స్థానికులు షాక్ కు గురయ్యారు. 

దీనిపై జూ అధికారులు స్పందించారు. ‘భద్రతా నియమాలను ఉల్లంఘించడం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లే ప్రయత్నాలు అసలు చేయకూడదు’ అని హెచ్చరించారు. క్రూర జంతువుల బోనులకు దగ్గరగా వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మళ్లీ గుర్తు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్రూర జంతువులను చూడాలనే కోరిక ఉండడం సరైందే కానీ, వాటి నుంచి పొంచిఉన్న ప్రమాదాలను కూడా అంచనా వేయాలి. లేకపోతే ఇలా ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. ఆ కుటుంబానికి ఎంత ఆవేదన మిగిలిపోయిందో అని వాపోతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AnimalAttack Brazil DangerousAnimals FatalEncounter Google News in Telugu Latest News in Telugu LionAttack ManKilled Telugu News Today WildlifeSafety ZooTragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.