📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Sonam Raghuvanshi: సోనమ్ తండ్రిని ఓదార్చిన ప్రియుడు

Author Icon By Shobha Rani
Updated: June 10, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ (Sonam Raghuvanshi) హత్యకు సుపారీ ఇచ్చిన సోనమ్ రఘువంశీ నిన్న పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాను అమాయకురాలినని, భర్త హత్యలో తనకెలాంటి పాత్ర లేదని సోనమ్ (Sonam Raghuvanshi) పోలీసుల విచారణలో వెల్లడించింది. మే 23న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా రఘువంశీ మరియు సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) దంపతుల కథ దారుణ హత్యగా మలిచింది. జూన్ 2న రాజా మృతదేహం కనుగొనబడింది. సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా, అతడి స్నేహితులు ముగ్గురు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. కాగా, రాజా రఘువంశీ (Sonam Raghuvanshi) మృతదేహం ఈ నెల 2న లభ్యం కాగా.. ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇండోర్ కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సోనమ్ తల్లిదండ్రులు తమ దగ్గరి బంధువులతో కలిసి హాజరయ్యారు. రాజా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా.. ఆమె తండ్రిని ఓదార్చుతూ కనిపించడం గమనార్హం. రాజా రఘువంశీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో సోనమ్ తండ్రిని రాజ్ కుశ్వాహా ఓదార్చడం కనిపించింది.

Sonam Raghuvanshi: భర్త శవం వద్ద ప్రియుడు ఓదార్చడం: వైరల్ వీడియో

మేఘాలయ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం
వివరాల్లోకి వెళితే.. హనీమూన్ కోసం మే 23న మేఘాలయ వెళ్లిన రాజా, సోనమ్ దంపతులు అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైంది. సోనమ్ (Sonam Raghuvanshi) ఆచూకీ లభించలేదు. వారం రోజుల తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు పట్టుబడింది. మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజాను హత్య చేసేందుకు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్లాన్ చేసి వికాశ్, ఆనంద్, ఆకాశ్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టి, ఈ ముగ్గురు కిల్లర్లను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ కేసు తీవ్రంగా చర్చించబడుతోంది. ప్రేమ, నమ్మకం, ద్రోహం అనే భావాలు ఈ కేసులో కలగలిసిపోయాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడమంటే ఎంత దారుణం అనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Raja Raghuvanshi: రాజా రఘువంశీని తలపై కొట్టి

at his dead body: Viral video Boyfriend comforts husband Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.