📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Austria: మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

Author Icon By Vanipushpa
Updated: December 8, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రియా(Austria)లో అత్యంత ఎత్తైన గ్రాస్‌గ్లాక్నర్ పర్వతంపై జరిగిన ఒక విషాద ఘటనలో 33 ఏళ్ల కెర్‌స్టిన్ గర్ట్‌నర్ అనే మహిళ చలికి గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతికి తీవ్ర నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలపై ఆమె ప్రియుడు, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు థామస్ ప్లాంబర్గర్‌ (39)పై అధికారులు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కెర్‌స్టిన్, థామస్ ఇద్దరూ గ్రాస్‌గ్లాక్నర్ పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు. అనుకున్న సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరడంతో వారు తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నారు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, పెనుగాలుల ధాటికి కెర్‌స్టిన్ తీవ్రంగా అలసిపోయి, నీరసించిపోయింది. పర్వత శిఖరానికి కేవలం 150 అడుగుల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Read Also: JD Vance controversy : వీసా వ్యాఖ్యలతో వివాదంలో జేడీ వాన్స్‌…

Austria

నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష

ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 2 గంటల సమయంలో థామస్ సహాయం కోసం వెళ్తున్నానని చెప్పి కెర్‌స్టిన్‌ను అక్కడే ఒంటరిగా వదిలి వెళ్లాడు. చలి నుంచి రక్షణ కల్పించేందుకు తన వద్ద ఉన్న ఎమర్జెన్సీ దుప్పట్లు లేదా ఇతర సామగ్రిని కూడా ఆమెకు ఇవ్వలేదని వారు ఆరోపించారు. అంతేకాకుండా, సహాయక బృందాలకు సమాచారం ఇవ్వడంలో గంటల తరబడి ఆలస్యం చేయడమే కాకుండా, తొలి కాల్ తర్వాత తన ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టాడని తెలిపారు. తీవ్రమైన గాలుల కారణంగా సహాయక బృందాలు మరుసటి రోజు ఉదయానికి కానీ అక్కడికి చేరుకోలేకపోయాయి. అప్పటికే కెర్‌స్టిన్ మరణించింది. ఈ కేసులో థామస్‌పై తీవ్ర నిర్లక్ష్యంతో హత్యకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. నేరం రుజువైతే అతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం ఒక దురదృష్టకర ప్రమాదమని అతని తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ 2026 ఫిబ్రవరి 19న జరగనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Couple Incident Google News in Telugu Human interest story Ice Incident Latest In telugu news Relationship Drama shocking news social media trending Telugu News Today unexpected twist Viral Story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.