📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: iPhone: ఉద్యోగులందరికీ ఫ్రీగా ఐఫోన్ బహుమతిగా ఇచ్చిన బాస్..ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 8:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ (Technology) ప్రియులు ఎక్కువగా ఎదురుచూసే స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ ఐఫోన్ సిరీస్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం కొత్త మోడల్ విడుదల కానున్న సమయం రాగానే, యాపిల్ స్టోర్ల ముందు అభిమానులు గంటల తరబడి క్యూలు కడతారు. ఐఫోన్ బ్రాండ్ అంటేనే ప్రెస్టీజ్ సింబల్‌గా భావించే వారు ఉన్నారు. ముఖ్యంగా యువత నుంచి బిజినెస్ క్లాస్ (Business class) వరకు అందరూ దీనిని కల ఫోన్‌గా భావిస్తారు.

Randhir Jaiswal: 2,417 మంది ఇండియన్స్ ను బయటికి పంపిన అమెరికా

ఇక ఇటీవలె యాపిల్ కంపెనీ ఐఫోన్ సిరీస్‌లో 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్, 17 ఎయిర్ మోడల్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిని కొనేందుకు యాపిల్ లవర్స్ ఎగబడుతున్నారు. అయితే అలాంటి సమయంలో ఒక కంపెనీ..

అందులో పనిచేసే ఉద్యోగులు అందరికీ ఫ్రీగా యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను అందించింది. ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఆ కంపెనీ బాస్.. తన ఉద్యోగులకు వాటిని అందించడం విశేషం.

 iPhone

తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు

మీడియాస్టార్మ్ అనే ప్రముఖ చైనీస్ మీడియా కంపెనీ అధిపతి టిమ్ పాన్.. తన ఉద్యోగులందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొత్త ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ (iPhone 17 Pro Max) ను.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరికీ అందించాలని నిర్ణయించుకున్నారు. అయితే కంపెనీలో పనిచేసే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరికీ ఐఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఆ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌గా పనిచేస్తున్నా, కొత్తగా చేరిన ఉద్యోగులైనా, ప్రస్తుతం కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ ఐఫోన్‌ను ఇచ్చారు. ఇక ఉద్యోగులు తమకు నచ్చిన కలర్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను ఎంచుకునే అవకాశాన్ని కూడా మీడియాస్టార్మ్ కంపెనీ (Mediastorm Company) కల్పించడం మరో విశేషం.

ప్రతీ ఫోన్ బేస్ మోడల్ ధర సుమారు 1899 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.1.68 లక్షలుగా ఉంది. అంతేకాకుండా.. చైనాలో ఉద్యోగులకు కంపెనీ బహుమతులుగా ఇచ్చే వాటిపై పన్ను కూడా వర్తిస్తుంది. అయితే.. ఫ్రీగా ఐఫోన్ ఇవ్వడమే కాకుండా.. దానిపై పడే పన్ను భారాన్ని కూడా మీడియాస్టార్మ్ కంపెనీనే భరిస్తుందని సీఈఓ టిమ్ పాన్ ప్రకటించడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Apple Apple fans Breaking News global launch iPhone 17 Air iPhone 17 Pro iPhone 17 Pro Max iPhone 17 series latest news smartphone craze Tech News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.