📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Bosnia: బోస్నియాలో పేదల్ని హతమార్చిన సంపన్నులు

Author Icon By Sushmitha
Updated: November 14, 2025 • 2:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్ని అక్రమాలు, అన్యాయాలు ఎన్నటికీ బయటపడవని అనుకుంటారు. తప్పు చేసిన వారు ఎప్పుడో ఒకసారి దొరికిపోతారు. నేరస్తులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒకచోట చిన్న తప్పిదంతో దొరికిపోతారు. అందుకే ఏదో ఒకరోజు నేరస్తులు పట్టుపడక తప్పదు. తాజాగా ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం చేసిన నేరం నేడు వెలుగులోకి వచ్చింది. అధికారులను పరుగు పెట్టిస్తున్నది. దేశాన్నే ఓ కుదుపు కుదిపేస్తున్న సంఘటన ఇది. యుద్ధంతో కష్టాలు పడుతున్న ప్రజలపై జాలి, దయ చూపాల్సింది పోయి.. మానవత్వం మరిచారు కొందరు సంపన్నులు తమ సరదా కోసం భారీగా డబ్బులిచ్చి అమాయకులైన జనాలను వేటాడి ఉసురుతీశారు.

వేటను ఇష్టపడేవారు అడవిలో జంతువులను, మృగాలను ఎవరైనా వేటాడతారు. కానీ, ఇక్కడ మనుషుల్నే వేటాడి మృగాలకంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిన ఈ ఘటన దాదాపు మూడు దశాబ్దాల కిందట బోస్నియా యుద్ధంలో చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సంపన్నులపై దర్యాప్తుతో నరమేధం బయటపడింది.

Read Also: Tirumala: ఏఐ చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం

Bosnia

బోస్నియాలో యుద్ధం సమయంలో జరిగిన ఘటన

బోస్నియాలో(Bosnia) 1992-95 మధ్యకాలంలో సంఘర్షణ కొనసాగింది. రెండో ప్రపంచ యుద్ధం(war) తర్వాత ఐరోపాలో చరిత్రలోనే అత్యంత హింసాత్మక సాయుధ ఘర్షణగా నిలిచిన ఈ యుద్ధంలో 11 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ సమాజం బోస్నియా-హర్జెగోవినాను 1992 తొలినాళ్లలో గణతంత్ర ప్రాంతంగా గుర్తించడంతో వివాదం మొదలైంది. దీనిని వ్యతిరేకించిన ‘బోస్నియా సెర్చ్ ‘ తమ సైన్యాలతో రాజధాని సరాజ వో నగరాన్ని ఆక్రమించింది. దాదాపు మూడేళ్లకుపైగా జరిగిన ఈ యుద్ధం సమయంలో కొందరు దారుణాలకు పాల్పడ్డారు.

డబ్బులిచ్చి మరీ చంపించారు ఇటలీకి(Italy) చెందిన సంపన్నులు డబ్బులిచ్చి సరాజెవో వీధుల్లో పౌరులను కాల్చి చంపినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ‘స్నైపర్ టూరిజం’ పేరుతో జరిగిన ఈ నరమేధాన్ని బోస్నియా సెర్చ్ దళాలు వెనకుండి నడిపించాయని పేర్కొన్నాయి. ఇటలీ సంపన్నులను సరాజెవో చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాలకు సెర్చ్ దళాలే తరలించాయని ఆరోపించాయి. స్నైపర్ రైఫిల్స్ తో అమాయకులను వారు అక్కడ వేటాడి చంపినట్లు వివరించాయి. ఇందుకోసం ఆ సంపన్నులు లక్ష యూరోల వరకు (రూ.కోటి) చెల్లించాయని తెలిపాయి.

మనిషిని బట్టి రేటు

మనిషిని బట్టి రేటు ఉండేదని, చిన్న పిల్లలైతే ఎక్కువగా చెల్లించేవారని నివేదికలు వెల్లడించాయి. వృద్ధులంటే అసలు లెక్కలేదని, వాళ్లను ఉచితంగా వేటాడేందుకు అనుమతించాయని వివరించాయి. బోస్నియా యుద్ధంలో స్నైపర్ టూరిజానికి విదేశీ సంపన్నులు పాల్పడినట్లు గతంలోనే పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎజియో గవాజెనీ కొన్నేళ్ల కిందట ఈ నివేదిక రూపొందించారు. కానీ తగిన సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో ఆ నివేదిక చెల్లలేదు.

ఇటలీని కుదిపేస్తున్న కథనాలు

స్లోవేనియా దర్శకుడు ‘సరాజెవో సఫారీ’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని 2022లో విడుదల చేశారు. దీని ఆధారంగా ఎజియో మళ్లీ తన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. బోస్నియా సెర్చ్ ఆర్మీ అధికారి సహా నివేదిక రూపొందించి ఇటలీ దర్యాప్తు అధికారులకు సమర్పించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ కథనాలు ఇటలీని కుదిపేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bosnia crime European news Google News in Telugu Latest News in Telugu Mass murder/atrocity Rich vs poor Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.