సిడ్నీలోని బొండీబీచ్లో జరిగిన దారుణ మారణహోమంలో దాదాపు పదహారు మంది మరణిం చారు. మరో 60 మందికి గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటన ఈ నెల 14న జరిగింది. పది సంవత్సరాల బాలిక, 87ఏళ్ల వృద్ధుడు ఈ దుర్ఘ టనలో ప్రాణాలు కోల్పోయారు. హనుక్క ప్రారంభ దినోత్సవం సంద ర్భంగా యూదు జాతికి చెందిన వారిపై యాంటీ జ్యోయిష్ వారు చేసిన దాడి యిది. ఇందులో ఇద్దరు తండ్రీ కొడుకులు పాల్గొన్నారు. తండ్రిని అక్కడికక్కడే పోలీసులు చంపేశారు. గాయాలతో బయటపడిన కొడుకును హాస్పిటల్లో చేర్చారు. ఇతను ఆరు నెలల నుంచి ఆస్ట్రేలియా పోలీసులు డొమెస్టిక్ ఇంటలిజెన్స్ వారిదర్యాప్తులో ఉన్నాడు. అయినా ఈ భయం కర సంఘటన దాదాపు కాశ్మీరులోని పహల్గాం సంఘటన తరహాలోనే జరగడం దురదృష్టకరం. యాంటీ సెమిటిక్ పేరుతో ఈ ఘటనలు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఆస్ట్రే లియాలో నివసిస్తున్న యూదుమతస్థుల మీద జరుగుతున్నా యి. 1996 సంవత్సరంలో టాస్మానియా పోర్ట్ ఆర్డర్లో జరిగిన సంఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోవటం ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోక తప్పదు. ఈ మధ్యకాలంలో జ్యూయిష్ వారి మీద తరచూ ఇలాంటి దాడులు జరగటం, ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనల వెనుక ఇరాన్ హస్తం ఉందనే అనుమానంతో ఇరానియన్ రాయబారితోసహా మరో ముగ్గురిని దేశం నుంచి బయటకు
పంపారు. అక్టోబరు 27, 2023 హమాస్ టెర్రరిస్టు సంస్థ ఇజ్రాయిల్పై దాడులు తర్వాత, గాజా పాలస్తీనుల మీద సంఘటనలు 2023- 24 మధ్య 2000 కేసులు దాకా రిపోర్టు అయ్యాయి. యాంటీ సెమిటిజం వారి తరపున పోరాడుతున్న వారు ఇచ్చిన సంఖ్యే ఇది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ ఆల్బనీస్ ఈ దుర్ఘటన నేపథ్యంలో సమైక్యంగా ఉండాలని ప్రజలను ఉద్దేశించి ప్రకటన చేయడం గమనార్హం. ఈ తరహా జాతి వ్యతిరేక ఘటనలు ఆస్ట్రేలియాలో ఎక్కువ సంఖ్యలో యూదు జాతివారు ఉండటం వల్ల జరుగుతుండటంతో ఆ దేశానికి పెద్దసమస్యగా మారింది.
Read Also: http://Australia Shooting: ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

జాతి వ్యతిరేక ఘటనలు
ఇజ్రాయిల్ ప్రధాని ఆస్ట్రేలియా ప్రధాని పాలసీల వల్లనే ఈ జాతి పట్ల వ్యతిరేక ఘటనలు జరుగుతున్నాయని విమర్శించటం హమాస్ సంస్థదాడులు, ఇజ్రాయిల్ప్రతిదాడుల తర్వాత ఈ విమర్శ విడ్డూరంగా ఉందని పశ్చిమ దేశాల నిపుణులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని విమర్శలు ప్రతి విమర్శలు పట్టించుకోకుండా, అక్క డున్న యూదు జతిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోక తప్పదు. లోకల్ సమస్యలు గ్లోబల్ సమస్యలుగా మారుతు న్నాయి. దాదాపు అన్ని ముఖ్య దేశాల్లో జాతుల పరస్పర వ్యతిరేక చర్యలు పెరగడం గమనిస్తున్నవారు జాతుల వ్యతి రేక, అనాగరిక చర్యలను గర్షిస్తున్నారు. రాజకీయ నాయకు లు తమ స్వలాభం కోసం ఇలాంటి హింసాకాండను రెచ్చ గొడుతున్నారని కూడా భావిస్తున్నారు. ఇజ్రాయిల్, గాజా ప్రాంతంలోని పాలస్తీనియన్ల, కాశ్మీర్లో హిందువులపై పాకి స్థాన్ ప్రోత్సాహంతో ఉగ్రవాదం చర్యలూ బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్లలో జరుగుతున్న సంఘటనలన్నిటికీ రాజకీయ,ఆర్థిక కారణాలే అని నిపు ణులుభావన. ఇలాంటి ఘోర సంఘటనల మధ్య కూడా మానవత్వం ఎక్కడో ఒక చోట తళుక్కు న మెరవక మానదు.
చరిత్ర సృష్టించిన అహ్మద్
యూదులపై సిడ్నీలో జరిగినదాడి యావత్ప్రపంచాన్ని కుదిపేసింది. కానీ నేను న్నాను ఉగ్రవాదులకు ఎదురొడ్డి బాధితులను కాపాడటానికి అంటూ ఒక హీరో అడ్డుగోడగానిల్చి చరిత్ర సృష్టించాడు. ఉగ్రవాదులను దాడిని ఎదుర్కొంటూ నేను చనిపోవచ్చు. నా కుటుంబానికి తెలియచేయండి, అని అన్నమాటలు అక్కడి వారి గుండెల ను కలిచివేశాయి. ఆ హీరో పేరు అహ్మద్ అల్ అహ్మద్! అహ్మద్ సిరియా నుంచి దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు బతుకు తెరువు నిమిత్తం వచ్చాడు. స్థానికంగా పండ్ల దుకా ణం పెట్టి జీవితాన్ని సాగిస్తున్నాడు. ఉగ్రదాడి నాడుఅహ్మద్ బోండి బీచ్లో (Bondi Beach)తనబంధువు డోజీ అల్కాండ్తో కలిసి కాఫీ షాపులో ఉన్నాడు. కాల్పుల శబ్దాల తర్వాత అహ్మద్ తేరు కొని ఉగ్రవాదులను ఎలాగైనా అడ్డుకోవాలని తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకొని ముందడుగు వేశాడు. నేను ఎదుర్కోవటంలో చనిపోతే ఇత రుల ప్రాణాలు రక్షించడానికి నేను నేలకొరిగాను అని నా కుటుంబానికి చెప్పు అని తన బంధువుతో చెప్పి, కాల్పులు జరుపుతున్న దుండగుడిని అడ్డుకున్నాడు. దీంతో దుండ గుడు పారిపోవటంతో ఎందరి ప్రాణాలనో కాపాడగలిగాడు. అడ్డుకుంటున్న సమయంలో అహ్మద్ గాయపడ్డాడు. కాల్పులు జరిపిన ఇద్దరు దుండ గులలో ఒకనికి సాజిత్ అక్రమ్ (తండ్రి) ఇండియన్ పాస్ పోర్టుతో ఫిలిప్పీన్స్ కు నవంబరు 1 నాడు కొడుకు నవీన్ (ఇతనికి ఆస్ట్రేలియన్ పాస్పోర్టే ఉంది) తో వెళ్లి 28 నవంబరు నాడు తిరిగి వచ్చాడు. ఫిలిప్పీన్స్ మిలటరీ ట్రయినింగ్ కోసం వెళ్లినట్లు ధ్రువపడలేదు. ఫిలిప్పీన్స్ లో ఇస్లామికేట్ గ్రూపుతో సంబంధమున్న మిలి టెంట్లు దాడిచేశారని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు.

గన్ కంట్రోల్
ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు ముఖ్యంగా యూదులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం గన్ కంట్రోల్ను పటిష్టం చేసింది. పోర్ట్ ఆర్డర్ ఉదంతం తర్వాత గన్ కంట్రోల్ విషయంలో చట్టాలు కూడా రూపొందించారు. కఠినమైన లైసెన్సింగ్ విధానాన్ని కూడా పాటిస్తు న్నారు. అయితే ఈబోండీ బీచ్(Bondi Beach) దాడి తర్వాత గన్ సేఫ్టీవిషయంలో ఆస్ట్రేలియాలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా చేయాల్సింది ఒకటే. మరింత కఠినతరంగా ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవడంతోపాటు సైద్దాంతిక ముసుగులో జరిగేలా దాడులను ఆపేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థతోపాటు దుండగులను ఏరిపారేసి కఠినంగా శిక్షించినప్పుడే ఎక్కువ సంఖ్యలో ఈ దేశంలో ఉన్నయూదులకు ఊరట లభిస్తుంది. కానీ కొన్ని దేశాలు కచ్చితంగా ఇలాంటి ఘటనలు సంభవిం చినప్పుడల్లా మరిం తగా అలజడులతోపాటు అంతర్జాతీయ సమస్యగా మార్చే ఎత్తుగడలు రాజకీయం చేస్తాయి. ఇజ్రా యిల్ ఇప్పటికీ హమాస్ సంస్థతోపాటు ఇస్లామిక్ దేశాలు ముఖ్యంగా ఇరాన్, టర్కీలను వేలెత్తి చూపుతున్నది. ఇరాన్ నిస్సందేహంగా మిలిటెంట్లకు సహకార సంపత్తులు ఇస్తున్న దని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్ దేశాలు మళ్లీ బరిలోకి దిగి ఏం చేస్తాయో అన్న భయాలుతలెత్తున్నాయి. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందాలనుకోవడం కూడా ఉద్రిక్తతలను పెంచుతున్నా యని కొందరి వాదన. కొత్తగా బంగ్లాదేశ్ అఫ్ఘాన్దే శాలు అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తాలిబన్లు ఇది వరకటి దుందుడుకు నడవడికను ప్రభుత్వం హస్తగతమవ టంతో తగ్గించుకున్నా పాకిస్థాన్ అఫ్ఘాన్ రాజకీయ ఎత్తుగ డలతోఏకీభవించడం లేదు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని తాలిబన్ల సహాయంతో నడిపించడానికి గండి పడటం తోపాటు అంతంత మాత్రంగా ఉన్న ప్రజాస్వామ్య పాలన మిలటరీ చేతుల్లోకి పరోక్షంగా వెళ్లడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్తో గొడవలు పెట్టుకొనే ఆస్కారం ఉంది. చైనా ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇరుగు, పొరుగు దేశాలు ఏ విధంగావ్యవహరిస్తాయో భారత్ ఒక కంట కనిపెట్టి ఉండక తప్పదు.
-రావులపాటి సీతారాంరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: