బోండీ బీచ్ హీరో అహ్మద్ అల్ అహ్మద్ కు రూ.14 కోట్ల నజరానా ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ నగరం లో యూదులపై ఉగ్ర దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ భయానక దాడి సమయంలో అహ్మద్ అల్ అహ్మద్ (Ahmed Al Ahmed) అనే వ్యక్తి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదులకు ఎదురెళ్లి గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Karnataka: కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్
ఈ నేపథ్యంలో ఈ హీరో కి ఓ సంస్థ భారీ నజరానా అందించింది. గో ఫండ్ మీ అనే సంస్థ ఏకంగా 2.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను బహుమతిగా ఇచ్చింది. అంటే మన భారత కరెన్సీలో రూ. 14.84 కోట్లు. సంస్థ ప్రతినిధులు జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్‌ను కలిసి ఈ మొత్తాన్ని చెక్కురూపంలో అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా 43వేల మంది దాతల నుంచి దీన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు అహ్మద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 14న బోండి బీచ్‌లో ఉగ్రదాడి సమయంలో అహ్మద్ తన స్నేహితుడితో కలిసి కాఫీ షాప్‌లో కాఫీ తాగుతున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో బయటికి పరుగులు తీశారు. అక్కడ మారణహోమం జరుగుతుండటాన్ని చూసి అహ్మద్ చలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: