థాయ్‌లాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియా సరిహద్దులోకి చొరబడి అక్కడ ఉన్న హిందూ ఆలయాలపై బాంబులు (Bombs on Hindu temples) వేసినట్లు కంబోడియా రక్షణ శాఖ (Cambodian Defense Ministry) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు సార్లు విమానాలు బాంబులు విసిరాయని స్పష్టం చేశారు.ఈ ఘటనను కంబోడియా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ మాలీ సొచియాటా మీడియా ముందు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – “థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు మా సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. మా భూభాగంలో నాలుగు సార్లు బాంబు దాడులు జరిగాయి” అని తెలిపారు.సాధారణంగా సైనిక మోహరింపు ప్రాంతాలే లక్ష్యంగా ఉండే దాడుల్లో, ఆలయాలు టార్గెట్ కావడం కంబోడియాలో ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల్లో ఉన్న పలు శివాలయాలు ఈ దాడుల్లో ప్రభావితమైనట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ప్రాణ నష్టం పై స్పష్టత లేదు.
తీవ్రంగా స్పందించిన కంబోడియా – అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలనే పంతమా?
ఈ దాడుల నేపథ్యంలో కంబోడియా ప్రభుత్వం తక్షణమే స్పందించింది. “ఇది అనేక అంతర్జాతీయ ఒప్పందాలకు వ్యతిరేకం” అని అంటోంది. మిత్రదేశాల మద్దతు కోసం యత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ దాడి వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
శాంతిని దెబ్బతీసే చర్యలు ఆపాలని హెచ్చరిక
కంబోడియా రక్షణశాఖ మాటల్లో తీవ్ర ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. “సరిహద్దుల్లో శాంతి భద్రతలు నిలబెట్టుకోవాలంటే ఇలాంటి చర్యలు తక్షణం ఆగాలి” అని తెలిపారు. యుద్ధ విమానాలు ఆలయాలపై దాడి చేయడం ఉగ్రవాదానికి సమానమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కేవలం ఆరంభమేనా? భవిష్యత్‌పై ప్రశ్నలు
థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో ఈ దాడులు మరిన్ని ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఆలయాలపై దాడి కావడంతో కంబోడియా ప్రజల్లో ఆవేదన నెలకొంది. రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ చర్చలు అవసరం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read Also : Air India : మరో ఎయిరిండియాలో సాంకేతిక లోపం