📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mumbai High Alert: ముంబైలో విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

Author Icon By Shobha Rani
Updated: May 17, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ ఆర్ధిక రాజధాని ముంబై (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మరోసారి బాంబు దాడి చేస్తామని బెదిరింపు లేఖను ముంబై విమానాశ్రయ పోలీసుల ఇ-మెయిల్ ఐడికి మెయిల్ ద్వారా పంపించారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, విమానాశ్రయంపై బాంబు దాడి జరుగనున్నదని ఆ ఇమెయిల్ లో పేర్కొన్నారు. ముంబై (Mumbai) పోలీసులకు ఓ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇ-మెయిల్ లో ముంబై (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై దాడి చేస్తామని హెచ్చరించారు. భద్రతా విభాగాలు తీవ్రంగా స్పందించాయి, నగరమంతటా పారామిలిటరీ దళాలు మోహరించారు.

Mumbai High Alert: ముంబైలో విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..


డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీంలు రంగంలోకి
ముంబై విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ పై బాంబు దాడి చేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ కలకలం సృష్టించింది. పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ఆ మెయిల్‌లో ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సైవక్కు శంకర్‌లను “అన్యాయంగా ఉరితీయడం” గురించి ప్రస్తావిస్తూ.. బెదిరింపు లేఖలో పేర్కొన్నారు. ముంబై (Mumbai) పోలీసులు ఆ మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై నగరం అత్యధిక నిఘా కింద ఉంది. అధికారులు ఇప్పటికిప్పుడు ఆపరేషన్‌లను కొనసాగి స్తుండగా, ప్రజలు భయపడకుండానే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉగ్రవాద శక్తులు మళ్లీ తలెత్తే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్రం సమన్వయంతో సమగ్ర భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి.
బెదిరింపు మెయిల్ వివరాలు – ఉగ్రవాద వ్యాఖ్యలు కలకలం
బెదిరింపు ఈమెయిల్స్ అందిన తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. దీని తరువాత ముంబై అంతటా పారామిలిటరీ దళాలను మోహరించారు. ఇక్కడ డాగ్ స్క్వాడ్ బృందం ముంబై(Mumbai) లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లోని ప్రతి మూలను శోధించింది. ముంబై పోలీసులు ఆ మెయిల్ పంపిన వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు. గతంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు దాడి బెదిరింపు వచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భద్రత విషయంలో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపారు. మరణించిన పర్యాటకులలో చాలా మంది మహారాష్ట్రకు చెందినవారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారతదేశం పాకిస్తాన్, పీవోకేలో వైమానిక దాడులు చేసింది. భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా మరణించారు.

Read Also: India-pak : గ్లోబల్ స్థాయిలో మోడీ కొత్త వ్యూహం..

Bomb threats to Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mumbai airport and Taj Hotel Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.