📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Bob Simpson: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కోచ్ బాబ్ సింప్సన్ ఇకలేరు!

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ (Bob Simpson) 89 ఏళ్ల వయసులో సిడ్నీలో కన్నుమూశారు. ఆయన మరణం ఆస్ట్రేలియా క్రికెట్‌కే కాకుండా ప్రపంచ క్రికెట్‌కూ పెద్ద లోటుగా మారింది. ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా నాలుగు దశాబ్దాలకు పైగా తన సేవలతో ఆయన క్రికెట్‌లో చెరగని ముద్ర వేశారు.బాబ్ సింప్సన్ పూర్తి పేరు రాబర్ట్ బాడ్డన్ సింప్సన్. 1936లో జన్మించిన ఆయన 1957లో ఆస్ట్రేలియా జట్టుకు అరంగేట్రం చేశారు. దాదాపు 62 టెస్టులు ఆడి 4,800కి పైగా పరుగులు సాధించారు. ఓపెనర్‌గా, అలాగే ఆల్‌రౌండర్‌గా తన ప్రతిభను చూపించారు. లెగ్ స్పిన్ బౌలింగ్‌లో కూడా చురుకైన పాత్ర పోషించారు. 1963లో ఆయనను ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా నియమించగా, 1968 వరకు తన ఆధ్వర్యంలో జట్టును విజయపథంలో నడిపించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టు స్థిరత్వాన్ని, పోరాట పటిమను పెంపొందించడంలో సింప్సన్ కీలక పాత్ర వహించారు.

భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ను తొలిసారి

ఆటగాడిగా కెరీర్ ముగించిన తర్వాత, బాబ్ సింప్సన్ క్రికెట్ నుండి దూరం కాలేదు. 1986లో ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో జట్టు అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడింది. ఆయన క్రమశిక్షణ, వ్యూహరచన, కఠిన శిక్షణలతో జట్టును కొత్త శక్తితో తీర్చిదిద్దారు. ఆయన కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా 1987లో భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ను తొలిసారి గెలిచింది. అదేవిధంగా 1995లో వెస్టిండీస్‌ (West Indies) పై సిరీస్ గెలిచి, ఆస్ట్రేలియా మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో అగ్రగామిగా నిలిచింది.బాబ్ సింప్సన్ కేవలం ఆటగాడు, కోచ్ మాత్రమే కాదు. ఆయన రిఫరీగా, క్రికెట్ వ్యాఖ్యాతగా, జట్టు నిర్మాతగా కూడా సేవలందించారు. ఆటపై ఉన్న లోతైన అవగాహనతో అనేక తరాలకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన ఆట శైలి, క్రమశిక్షణ, కట్టుదిట్టమైన వ్యూహాలు కొత్తతరం ఆటగాళ్లను ప్రేరేపించాయి.

బాబ్ సింప్సన్ రికార్డులు, విజయాలు

బాబ్ సింప్సన్ 1957లో ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టులో చేరారు. 1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్ సంక్షోభం తర్వాత 41 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టు (Australian team) బలహీనంగా ఉండేది. దానిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గొప్ప రన్ స్కోరర్. 1960లలో బిల్ లారీతో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆ తర్వాత ఆయనను ఆస్ట్రేలియా ఫుల్-టైమ్ కోచ్‌గా నియమించింది.1964లో ఇంగ్లండ్ జట్టుపై 311 పరుగులు చేసి టెస్టుల్లో ట్రింపుల్ సెంచరీ సాధించిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచారు. స్లిప్ ఫీల్డర్ గా కూడా ఆయనకు గొప్పపేరుంది. 62 టెస్టుల్లో 110 క్యాచ్‌లతో రికార్డు సృష్టించారు. 1964లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1968లో రిటైర్ అయ్యారు.

కోచ్‌గా అద్భుతమైన సేవలు

ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత 1986-1996 మధ్య ఆస్ట్రేలియాకు కోచ్‌గా గొప్ప సేవలు అందించారు. ఆస్ట్రేలియా మొదటి పూర్తి-కాల్ కోచ్‌గా ఆయన ఆ దేశ క్రికెట్ కు ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారు. ఆయన కోచింగ్‌లో ఆస్ట్రేలియా 1987లో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 1989లో యాషెస్‌ను తిరిగి పొందింది. 1995లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. వెస్టిండీస్‌పై 17 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా ఈ విజయం సాధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. 2007లో ఆయనకు ఆస్ట్రేలియా క్రికెట్‌కు చేసిన సేవలకుగాను “ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా” అవార్డు లభించింది.

బాబ్ సింప్సన్ ఎవరు?

బాబ్ సింప్సన్ ఒక ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్, కోచ్. ఆటగాడిగా, కోచ్‌గా ఆస్ట్రేలియా జట్టుకు విశేష సేవలు అందించారు.

ఆయన పూర్తి పేరు ఏమిటి?

ఆయన పూర్తి పేరు రాబర్ట్ బాడ్డన్ సింప్సన్.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ipl-2026-trading-kkr-csk-competition-rr-decision/sports/530872/

australia former cricket captain australian cricket legend bob simpson age 89 bob simpson passes away Breaking News coach bob simpson latest news sydney news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.