📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Blood Group: బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అరుదైన బ్లడ్ గ్రూప్

Author Icon By Anusha
Updated: July 31, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వైద్య చరిత్రలో భారత్ ఒక కొత్త అధ్యాయాన్ని రాశింది. బెంగళూరుకు చెందిన వైద్య నిపుణులు ఇంతవరకు గుర్తించబడని, అత్యంత అరుదైన కొత్త రక్త వర్గం ‘క్రిబ్’ (CRIB) ను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ రక్త వర్గం ప్రపంచంలో కేవలం 10 మందికి మాత్రమే ఉందని భావిస్తుండగా, వారిలో ఒకరు భారత్‌లో ఉండడం దేశానికి గర్వకారణమైంది.బెంగళూరు (Bangalore) లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో 36 ఏళ్ల మహిళ సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లారు. రక్తపరీక్షలు చేసిన వైద్యులు ఆశ్చర్యకరమైన విషయం గుర్తించారు. ఆమె రక్త నమూనా సాధారణంగా ఉన్న A, B, AB, O వర్గాలు,Rh పాజిటివ్/నెగటివ్ గ్రూపులకు సరిపోలలేదు. రక్తంలో ప్రత్యేకమైన యాంటీజెన్లు, యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు తొలుత ఇది ఏ రక్త వర్గం అనేది అర్థం చేసుకోలేకపోయారు.

కుటుంబ సభ్యులపై కూడా పరీక్షలు

ఈ పరిస్థితి స్పష్టత కోసం వైద్యులు ఆమె కుటుంబ సభ్యులందరిని ఆసుపత్రికి పిలిపించారు. మొత్తం 20 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ, ఈ ప్రత్యేక రక్త వర్గం మిగతా కుటుంబ సభ్యుల్లో ఎవరికి కనిపించలేదు. దీంతో ఈ కొత్త రక్త వర్గం అత్యంత అరుదైనది, ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మందికే ఉందని నిర్ధారణకు వచ్చారు. దీనికి ‘క్రిబ్’ (CRIB) అని పేరు పెట్టారు.మహిళ రక్తాన్ని లోతైన పరిశోధనలు నిమిత్తం బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో ఉన్న ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఈ ల్యాబ్ 10 నెలల పాటు ఆమె రక్తంపై అధ్యయనం చేసింది. క్రోమర్ సిస్టమ్‌లో ఓ కొత్త యాంటీ జెన్ పదార్థం ఉన్నట్లు గుర్తించింది.

Blood Group: బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అరుదైన బ్లడ్ గ్రూప్

వైద్య ప్రపంచంలో చర్చనీయాంశం

ఈక్రమంలోనే క్రోమర్, బెంగరూళురు పదాలను కలుపుతూ.. ఈ రక్తానికి CRIBగా నామకరణం చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన అనేక విషయాల గురించి వివరించారు.’క్రిబ్’ రక్త వర్గాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో కొన్ని ప్రత్యేక రకాల యాంటీబాడీలు ఉంటాయని నిపుణులు తెలిపారు. ఇవి ఇతర సాధారణ రక్త వర్గాలకు చెందిన రక్తాన్ని స్వీకరించడానికి అడ్డుపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్త మార్పిడి అవసరమైనప్పుడు ఇది పెద్ద సవాలును విసిరే అవకాశం ఉందన్నారు. ఈ కొత్త రక్తవర్గం ఆవిష్కరణ రక్తం యొక్క జన్యుశాస్త్రం, వివిధ రక్తవర్గాల మధ్య సంబంధాలపై మరింత లోతైన అధ్యయనాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు.

O+ రక్త గ్రూప్ అరుదైనదా?

కాదు, O+ రక్త గ్రూప్ చాలా సాధారణమైనది. ప్రపంచ జనాభాలో సుమారు 38% మంది ఈ రక్త గ్రూప్‌ను కలిగి ఉంటారు.

O+ రక్తం ఎందుకు ఎక్కువ అవసరమవుతుంది?

O+ రక్త గ్రూప్ ఎక్కువ మందికి సరిపోతుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో, శస్త్రచికిత్సలలో, ప్రమాదాల సమయంలో ఈ రక్తానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

Read hindi news : hindi.vaartha.com

Read Also: India-Russia : రష్యాతో భారత్ సంబంధాలపై ట్రంప్ ఆగ్రహం

Breaking News CRIB blood type found in Bangalore India rare blood group discovery latest news new blood group in medical history unique antigen antibodies India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.