📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

America: బిట్ కాయిన్ పనికిరానిది, దాని విలువ జీరోనే..ఫార్ వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: February 9, 2026 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా మార్కెట్ నిపుణులు.. అది ఓ పనికిరానిది అని దానికి విలువ ఉండదని తేల్చి చెప్పారు. డిజిటల్ కరెన్సీ జీరోకి పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగిత్తిస్తున్నాయి. కాగా గత వారం క్రిప్టో మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలాన్ని కూడా ఇస్తున్నాయి. గత 15 నెలల కాలంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టిన చాలా మంది పెట్టుబడిదారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 122,200 డాలర్ల గరిష్ట స్థాయి నుంచి సగానికి పైగా పడిపోయింది. అయితే ధరలు పడిపోయిన వెంటనే బై ఆన్ ద డిప్స్ అనే నినాదంతో బిట్ కాయిన్ మద్దతుదారులు మళ్లీ రంగంలోకి దిగారు. దాంతో శుక్రవారం బిట్‌కాయిన్(Bitcoin) కొంత మేరకు రికవరీ సాధించింది. తాత్కాలికంగా ఈ ర్యాలీ కొనసాగడానికి తగినంత మంది ఆశావాదులు ఉండవచ్చు. అయితే అసలు ప్రశ్న అది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే బిట్‌కాయిన్‌కు నిజంగా ఏమైనా విలువ ఉందా? అమెరికా మార్కెట్ పరిశోధనా సంస్థ పివోటస్ పార్టనర్స్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ రిచర్డ్ ఫార్ ఈ ప్రశ్నకు చాలా కఠినమైన సమాధానం ఇచ్చారు. ఆయన బిట్‌కాయిన్‌కు సున్నా ధర లక్ష్యాన్ని నిర్దేశించారు.

Read Also: Rameshan Chandrasen: బంగ్లాదేశ్‌లో హిందూ నేత జైల్లో మృతి

America: బిట్ కాయిన్ పనికిరానిది, దాని విలువ జీరోనే..ఫార్ వ్యాఖ్యలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం

ఇది సహజంగానే పెద్ద సంచలనం రేపింది. కానీ ఆయన వాదనను లోతుగా పరిశీలిస్తే.. దానిలో తర్కం కనిపిస్తుంది. బిట్‌కాయిన్ లేదా ఇతర క్రిప్టోకరెన్సీలకు ఆదాయం లేదు, ఆస్తులు లేవు. వాటి వెనుక ఉన్న ఏకైక ఆధారం.. వాటిని కలిగి ఉన్న వారి నమ్మకం మాత్రమే అని తెలిపారు. Bitcoin విలువ ఎప్పుడు సున్నా అవుతుందో తేదీ చెప్పడం కష్టం. కానీ దీర్ఘకాలంలో అది జరగవచ్చనే అవకాశం ఉందని ఈ వాదన చెబుతోంది. ఇంకా ముందుకు వెళ్లి, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కంటే లాభమే ఎక్కువ తీసుకువస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుప్పకూలిన బిట్ కాయిన్ ధర.. కొంపలు ముంచిన ట్రంప్ 25 శాతం సుంకం హెచ్చరిక ఎందుకంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే.. ప్రజల పొదుపులను తీసుకొని, వాటిని ఉత్పాదక పెట్టుబడులుగా మార్చడం. మీరు బ్యాంకులో డబ్బు జమ చేస్తే, అది రుణాల రూపంలో పరిశ్రమలు లేదా గృహ నిర్మాణాలకు వెళ్తుంది. మీరు ఒక కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తే, ఆ సంస్థ కార్యకలాపాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bitcoin criticism blockchain technology crypto market cryptocurrency debate Digital currency financial opinions investment risks Telugu News Paper Telugu News Today virtual assets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.