📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Bitcoin: విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా

Author Icon By Sudha
Updated: October 15, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల, అమెరికా న్యాయ శాఖ (DOJ) అత్యంత పెద్ద పరిమాణంలో బిట్‌కాయిన్‌ను సీజ్ చేసింది. ఈ సీజ్ రూ. 127,271 BTC — సుమారుగా 15 బిలియన్ డాలర్లు విలువైనది. సుమారు 14 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన బిట్‌కాయిన్‌(Bitcoin)ను అమెరికా ప్ర‌భుత్వం సీజ్ చేసింది. ఈ కేసులో కంబోడియాకు చెందిన ప్రిన్స్ గ్రూపు వ్యాపార‌వేత్తపై అభియోగాలు న‌మోదు చేశారు. క్రిప్టోక‌రెన్సీ స్కామ్‌కు సూత్ర‌ధారిగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు అమెరికా ఆరోపించింది. యూకే, కంబోడియా జాతీయుడు చెన్ జీపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు మోపారు. బిట్‌కాయిన్ (Bitcoin) బిజినెస్ ద్వారా మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Bitcoin: విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా

వాస్త‌వానికి అమెరికా, బ్రిట‌న్ దేశాలు చెన్‌కు వ్యాపార అనుమ‌తులు ఇచ్చింది. కానీ అత‌నికి చెందిన ఆస్తుల‌ను సీజ్ చేసిన‌ట్లు యూకే ప్ర‌భుత్వం చెప్పింది. లండ‌న్‌లో ఉన్న 19 ప్రాప‌ర్టీల‌ను సీజ్ చేసింది. వాటి విలువ సుమారు 133 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంది. క్రిప్టో చ‌రిత్ర‌లో ఇదో పెద్ద ఆర్థిక నేర‌మ‌ని అమెరికా ప్రాసిక్యూట‌ర్లు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో బిట్‌కాయిన్‌ (Bitcoin)ను సీజ్ చేయ‌డం ఇదే మొద‌టిసారి అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం చెన్ ప‌రారీలో ఉన్నారు. అయితే సైబ‌ర్ ఫ్రాడ్ క్రైంలో సూత్ర‌ధారి అయిన అత‌నిపై అమెరికా నిఘా పెట్టింది.

బిట్ కాయిన్ మంచిదా చెడ్డదా?

బిట్‌కాయిన్ అనేది స్పష్టమైన అధిక అస్థిరతతో కూడిన ప్రమాదకర పెట్టుబడి , మరియు సాధారణంగా మీరు అధిక రిస్క్ టాలరెన్స్ కలిగి ఉంటే, ఇప్పటికే బలమైన ఆర్థిక స్థితిలో ఉంటే మరియు మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని లేదా అన్నింటినీ కోల్పోయే అవకాశం ఉంటే మాత్రమే పరిగణించాలి.

బిట్ కాయిన్ ఎలా మొదలైంది?

బిట్‌కాయిన్‌ను సతోషి నకమోటో అనే మారుపేరు గల వ్యక్తి లేదా బృందం సృష్టించింది , అతను 2008 శ్వేతపత్రంలో ఈ సాంకేతికతను వివరించాడు. ఇది ఆకర్షణీయంగా సరళమైన భావన: బిట్‌కాయిన్ అనేది డిజిటల్ డబ్బు, ఇది ఇంటర్నెట్‌లో సురక్షితమైన పీర్-టు-పీర్ లావాదేవీలను అనుమతిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Asset Seizure Bitcoin BreakingNews Crypto News Cryptocurrency latest news Telugu News US government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.