📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bill Gates : 100 ఏళ్లైనా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదు : బిల్‌గేట్స్‌

Author Icon By Sudha
Updated: July 10, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (Artificial intelligence)‌.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఏఐ విస్తరించింది. దీంతో ఏఐ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించి.. వారి స్థానాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనల వేళ మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 100 ఏళ్లైనా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదన్నారు. అంతేకాదు కోడింగ్‌ పైనా ఏఐ ప్రభావం ఉండదని చెప్పారు.

Bill Gates : 100 ఏళ్లైనా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదు : బిల్‌గేట్స్‌

మానవ మేధస్సు లేని యంత్రాలు

ఓ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ (Bill Gates)మాట్లాడుతూ.. ‘కృత్రిమ మేధ అనేది ప్రోగ్రామింగ్ రంగంలో మనిషికి ప్రత్యామ్నాయం కాలేదు. కేవలం ఒక సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది. ప్రోగ్రామింగ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించేదాన్ని క్రియేటీవ్‌గా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌లో అది సవాలుతో కూడుకున్న విషయం. మానవ మేధస్సు లేని యంత్రాలు (ఏఐ) అలా చేయలేవు’ అని బిల్‌గేట్స్‌ (Bill Gates) వ్యాఖ్యానించారు. అదేవిధంగా కోడింగ్ అంటే కేవలం టైపింగ్‌ చేయడం కాదని.. చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని బిల్‌గేట్స్‌ తెలిపారు. ఈ మేరకు భవిష్యత్తులో కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, బయాలజీ రంగాలకు ఆటోమేషన్‌ ముప్పు తక్కువేనని ఆయన అంచనా వేశారు.

బిల్ గేట్స్ ఎందుకు ప్రసిద్ధి చెందారు?

బిల్ గేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్‌ను సహ-స్థాపించినందుకు మరియు వ్యక్తిగత కంప్యూటర్ విప్లవానికి ఆయన చేసిన గణనీయమైన కృషికి ప్రసిద్ధి చెందారు. ప్రపంచ ఆరోగ్యం మరియు అభివృద్ధిపై దృష్టి సారించే బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన దాతృత్వ పనులకు కూడా ఆయన ప్రసిద్ధి చెందారు.

బిల్ గేట్స్ ఎలా విజయం సాధించారు?

గేట్స్ విజయానికి దోహదపడిన ముఖ్య అంశాలు ఆవిష్కరణలపై అతని దృష్టి, బలమైన నాయకత్వ నైపుణ్యాలు, భాగస్వామ్యాలు మరియు సహకారాల ప్రాముఖ్యతను గుర్తించే సామర్థ్యం మరియు నిరంతర అభ్యాసంపై అతని ప్రాధాన్యత.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Modi: 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగంతో మోదీ ఘనత

AI Artificial intelligence bill gates Breaking News future of work latest news programmers tech industry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.