Bill gates ai warning : మరో నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, ఆ మార్పులో భాగంగా లక్షలాది ఉద్యోగాలు మాయమయ్యే ప్రమాదం ఉందని Bill Gates హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలకు పెద్ద ముప్పు ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సమావేశాల సందర్భంగా భారత జాతీయ మీడియాతో మాట్లాడిన బిల్ గేట్స్, ఏఐ ఊహించిన దానికంటే వేగంగా జాబ్ మార్కెట్ రూపాన్ని మార్చబోతోందని అన్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో ప్రొడక్టివిటీ భారీగా పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్లలో లోయర్ స్కిల్ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తోందని చెప్పారు. ఈ ప్రభావం వైట్ కాలర్ మాత్రమే కాకుండా బ్లూ కాలర్ ఉద్యోగాలపై కూడా పడుతుందని తెలిపారు.
Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లే ప్రమాదం
ఏఐ వలన ఆరోగ్య రంగంలో వ్యాధుల గుర్తింపు, (Bill gates ai warning) చికిత్స వేగంగా జరుగుతోందని, విద్యా వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని బిల్ గేట్స్ అన్నారు. అయితే ప్రభుత్వాలు ఈ మార్పులను తగినంతగా గమనించడంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏఐపై సరైన నియంత్రణ, విధానాలు లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు, నియామక విధానాలు, ఆర్థిక సమానత్వం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇటీవల విడుదల చేసిన ‘ది ఇయర్ అహెడ్’ లేఖలో కూడా బిల్ గేట్స్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు చూసిన మార్పులు చాలా చిన్నవేనని, రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల లాభాలు కొద్దిమంది చేతుల్లోకే కేంద్రీకృతమైతే అసమానతలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తూ, ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే సమిష్టి విధానాలు, అంతర్జాతీయ సహకారం తప్పనిసరిగా అవసరమని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: