అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘టారిఫ్స్’ (సుంకాల) విధానానికి స్వదేశీ చట్టసభలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభ (US House) కీలక నిర్ణయం తీసుకుంది. డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ వ్యతిరేక తీర్మానం 219-211 ఓట్ల తేడాతో నెగ్గింది. ట్రంప్ తన అధ్యక్ష అధికారాలను (International Emergency Economic Powers Act – IEEPA) ఉపయోగించి కెనడాపై 25-35 శాతం మేర సుంకాలు విధించారు. అయితే, ఈ సుంకాల వల్ల అమెరికాలోని సామాన్య ప్రజలపై భారంగా మారిందని, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపిస్తూ చట్టసభ సభ్యులు ఈ మేరకు ఓటు వేశారు. ఇది ట్రంప్ వాణిజ్య విధానాలపై చట్టసభకు ఉన్న అసహనాన్ని స్పష్టం చేస్తోంది.
Telangana : తెలంగాణకు కేంద్రం మరో శుభవార్త
ఈ ఓటింగ్ లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు (డాన్ బాకన్, బ్రియాన్ ఫిట్జ్‌పాట్రిక్, జెఫ్ హర్డ్, కెవిన్ కిలీ, థామస్ మాస్సీ, డాన్ న్యూహౌస్) పార్టీ లైన్ ను దాటి తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. సుంకాల వల్ల తమ తమ నియోజకవర్గాల్లోని వ్యాపారాలు, వినియోగదారులు నష్టపోతున్నారని వారు బాహాటంగానే వ్యాఖ్యానించారు. “సుంకాలు అనేవి ఆర్థిక వ్యవస్థకు నికర ప్రతికూలత” అని కొందరు సభ్యులు పేర్కొనడం గమనార్హం. అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు ఇవ్వకుండా, టారిఫ్స్ విషయంలో కాంగ్రెస్ తన స్వతంత్రతను చాటుకోవాలని వారు వాదించారు.
ఓటింగ్ ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సుంకాలను వ్యతిరేకించే రిపబ్లికన్లపై రాబోయే ఎన్నికల (మిడ్-టర్మ్స్) సమయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రైమరీ ఎన్నికల్లో వారికి చుక్కలు చూపిస్తామని తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫారమ్ ద్వారా హెచ్చరించారు. అయితే, ఈ తీర్మానం అమలులోకి రావాలంటే సెనేట్ ఆమోదం పొంది, చివరికి అధ్యక్షుడి సంతకం కావాలి. ట్రంప్ దీనిని ‘వీటో’ (తిరస్కరించే అధికారం) చేసే అవకాశం 100% ఉంది. ఈ వీటోను అధిగమించాలంటే చట్టసభలో మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి, అది ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ, ఇది ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా మొదలైన తొలి బలమైన నిరసనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com