అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన విధానాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ప్రజలు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు. “NO KINGS” అనే నినాదంతో జరిగిన ఈ గ్లోబల్ ప్రొటెస్ట్‌లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ వంటి ప్రధాన అంశాలపై ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రజల అసంతృప్తికి దారితీశాయి. చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చి ట్రంప్ పాలసీలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
Latest News: Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి లక్ష రూపాయలు.. అయితే,బిగ్ ట్విస్ట్
నిరసనకారులు ప్రధానంగా ఇమిగ్రేషన్ పాలసీపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వలసదారుల హక్కులను తగ్గించేలా, విద్యా అవకాశాలను పరిమితం చేసేలా ట్రంప్ చర్యలు ఉన్నాయని వారు ఆరోపించారు. సెక్యూరిటీ పేరుతో దేశంలో భయానక వాతావరణం సృష్టించడం, సామాజిక వైవిధ్యాన్ని దెబ్బతీయడం జరుగుతోందని నిరసనకారులు తెలిపారు. “NO KINGS” అనే నినాదం ద్వారా అమెరికాలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ఏకపక్ష పాలనను అడ్డుకోవాలని సందేశం ఇచ్చారు. ఈ నిరసనల్లో విద్యార్థులు, వలసదారులు, మానవ హక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదే సమయంలో ట్రంప్ విధానాలపై అమెరికా బయట కూడా స్పందనలు వచ్చాయి. బ్రిటన్, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని అమెరికా ఎంబసీల ముందు కూడా ప్రజలు నిరసనలకు దిగారు. ట్రంప్ అంతర్జాతీయ అంశాల కంటే ముందుగా అమెరికాలోని విద్య, ఆరోగ్యం, ఉపాధి సమస్యలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. అమెరికా ప్రజలు తీసుకున్న ఈ గ్లోబల్ నిరసన చర్య ప్రజాస్వామ్య బలాన్ని మరోసారి చాటిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ విధానాలు భవిష్యత్తులో దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నదానిపై ఇప్పుడు అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమైంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/