Big Breaking: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపంఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. బుధవారం ఉదయం ఈ ప్రకంపనలు సులవేసి ఉత్తర తీర ప్రాంతాన్ని తాకినట్లు ఇండోనేషియా భూకంప పరిశీలనా సంస్థ (BMKG) వెల్లడించింది. ఈ వారంలో నమోదైన రెండవ అతిపెద్ద భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు.
Read Also: Hyderabad Crime: అయ్యో తల్లి! ఎంత పనిచేశావ్?
Big Breaking: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపంభూకంపం వల్ల ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. గత వారం మలుకు దీవుల సమీపంలోని బండా సముద్రం వద్ద సుమారు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది.
ఇదే సమయంలో, సోమవారం ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్ పరిసర ప్రాంతాలను 6.3 తీవ్రతతో భూకంపం కుదిపింది. ఆ ఘటనలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. స్థానిక అధికారుల ప్రకారం, నగరంలోని చారిత్రాత్మక బ్లూ మసీద్ కూడా భూకంప ప్రభావంతో దెబ్బతిన్నది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: