📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

FTA: భారత్ EU ల మధ్య ఒప్పందంతో లాభాలేన్ని?

Author Icon By Vanipushpa
Updated: January 28, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, యూరోపియన్ యూనియన్ (European Union) మధ్య 18 ఏళ్లుగా సాగుతున్న చర్చలకు ముగింపు పలుకుతూ ఒక కీలక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (Free Trade Agreement FTA) ఖరారైంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్, 2వ స్థానంలో ఉన్న యూరోపియన్ యూనియన్ కలిసి ఈ ఒప్పందాన్ని పూర్తి చేశాయి. ఈ రెండు దేశాలు కలిపి ప్రపంచ జీడీపీలో సుమారు 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఒప్పందం ఈ ఏడాదిలోనే సంతకం అయ్యే అవకాశం ఉందని, 2026లో అమల్లోకి వచ్చేలా చర్యలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తర్వాత ఒప్పందం అమలులోకి వస్తుంది.

Read Also: Budget 2026: బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దా?

FTA: భారత్ EU ల మధ్య ఒప్పందంతో లాభాలేన్ని?

భారత ఎగుమతిదారులకు భారీ ఊరట

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే యూరప్‌కు వెళ్లే 99 శాతం భారత ఉత్పత్తులు సుంకం లేకుండా ప్రవేశిస్తాయి. దీంతో భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, దుస్తులు, ఫుట్‌వేర్, లెదర్, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఆటో విడిభాగాలు, ఇంజినీరింగ్ వస్తువులకు పెద్ద లాభం చేకూరనుంది. ప్రస్తుతం యూరప్ విధిస్తున్న 10 నుంచి 26 శాతం వరకు ఉన్న సుంకాలు పూర్తిగా తొలగనున్నాయి. అయితే బీఫ్, చికెన్, బియ్యం, చక్కెర వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. ఈ ఒప్పందంతో భారత మార్కెట్‌లోకి వచ్చే యూరోపియన్ ఉత్పత్తులు కూడా చౌకవుతాయి. యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, మెడికల్ పరికరాలు, రసాయనాలు, ప్లాస్టిక్స్, ఔషధాలు, స్టీల్ వంటి వాటిపై ఉన్న భారీ సుంకాలు తొలగించనున్నారు.

భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు

లగ్జరీ కార్లపై ప్రస్తుతం 110 శాతం వరకు ఉన్న సుంకం కోటా పద్ధతిలో 10 శాతానికి తగ్గనుంది. వైన్, బీర్, మద్యం వంటి వాటిపై ఉన్న సుంకాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. దీంతో ప్రీమియం యూరోపియన్ ఉత్పత్తులు భారత వినియోగదారులకు తక్కువ ధరకు లభించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌ల వల్ల భారత ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించింది. దీని వల్ల అమెరికాకు వెళ్లే భారత ఎగుమతులు 21 శాతం వరకు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో భారత్-EU ఒప్పందం అమెరికాపై ఆధారాన్ని కొంత తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ ఇప్పటికే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2025 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 136 బిలియన్ డాలర్లకు చేరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bilateral relations Economic Cooperation Foreign Policy India EU agreement India European Union relations Investment Opportunities Telugu News online Telugu News Today trade agreement benefits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.