📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: BCCI – షేక్ హ్యాండ్ వివాదంపై స్పందించిన బీసీసీఐ

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ తరువాత చెలరేగిన ‘హ్యాండ్‌షేక్’ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన కీలక పోరులో భారత్ పాకిస్థాన్‌పై గెలుపొందిన తర్వాత, భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తూ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) (ఏసీసీ)కి ఫిర్యాదు చేశారంటూ వార్తలు వెలువడ్డాయి.

BCCI

మ్యాచ్‌ అనంతరం కరచాలనం అనేది ఎలాంటి అధికారిక

ఈ ఆరోపణలపై బీసీసీఐ (BCCI) కి చెందిన ఓ సీనియర్ అధికారి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఘాటుగా బదులిచ్చారు. మ్యాచ్‌ అనంతరం కరచాలనం అనేది ఎలాంటి అధికారిక నియమం కాదని, అది కేవలం స్నేహపూర్వక సంప్రదాయం మాత్రమేనని బీసీసీఐ తేల్చి చెప్పింది. కాబట్టి పాకిస్థాన్ జట్టు (Pakistan team) చేసిన ఫిర్యాదుకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని,

ఆ అంశాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి.మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్‌దీప్ యాదవ్ మాత్రమే హాజరయ్యారు. తాజా వివాదంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఇరు దేశాల క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతిన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sports-forced-to-play-against-pakistan-raina/sports/547687/

Asia Cup 2025 bcci response Breaking News handshake controversy India vs Pakistan Match latest news pakistan complaint rejected sportsmanship tradition Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.