📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

BCCI: బుమ్రాపై బీసీసీఐ ఆగ్రహం..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: August 1, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గత కొన్ని సంవత్సరాలుగా జట్టులో అత్యంత కీలక బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. అతని బౌలింగ్ శైలి, వేగం, డెత్ ఓవర్లలోని కచ్చితమైన యార్కర్లు ప్రత్యర్థి బ్యాటర్లను మట్టికరిపిస్తుంటాయి. అయితే, గత రెండు సంవత్సరాలుగా బుమ్రా గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనేక సిరీస్‌లకు దూరమవుతున్నాడు. ఈ క్రమంలో అతని వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) సీరియస్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు జరగగా, బుమ్రా మూడు టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ (Workload Management) కారణంగా ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో అతన్ని ఆడనివ్వలేదు. జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించిన ఈ విశ్రాంతి విషయంపై అనేక విమర్శలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు, అభిమానులు బుమ్రాను ఎందుకు పూర్తి సిరీస్ ఆడనివ్వలేకపోయారో ప్రశ్నించారు.

అన్ని మ్యాచ్‌లు

ఒక ఆటగాడు అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోతే, ఎందుకు సిరీస్‌కు ఎంపిక చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌ (Strength and Conditioning Coach) లు ఎప్పటికప్పుడు ఆటగాళ్ల వర్క్‌లోడ్‌పై అధ్యయనం చేస్తూనే ఉంటారు. బుమ్రా ఫిట్‌గా ఉండటం జట్టుకు కీలకం. వైద్య బృందం పర్యవేక్షించిన తర్వాతే అతన్ని తుది జట్టులో ఆడించడం జరుగుతుంది. అతను అన్ని మ్యాచ్‌లు ఆడగలడని భావిస్తేనే ఏదైనా సిరీస్‌కు ఎంపిక చేయాలనే ఆలోచనలో బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ ఉంది.’అని ఓ బీసీసీఐ (BCCI) అధికారి చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది.అయితే ఈ వార్తలను టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ఖండించాడు. ఇందులో నిజం లేదని చెప్పాడు. ‘బుమ్రాపై వస్తున్నవన్నీ తప్పుడు వార్తలే. అతన్ని అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడించాలని అనుకుంటాం. కానీ అతని శరీరం సహకరించాలి కదా? అతని శరీరానికి గౌరవం ఇవ్వాలి. అందుకే బుమ్రా వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ను జాగ్రత్తగా పరీక్షిస్తున్నాం. ఇష్టానుసారం ఆడుతానని బుమ్రా ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి కామెంట్స్ రావడం బాధాకరం.

BCCI:

ఆఖరి మ్యాచ్‌లో

మూడు టెస్ట్‌లు మాత్రమే ఆడుతానని సిరీస్‌కు ముందే చెప్పాడు. ఆ మ్యాచ్‌లు ఏంటో మేనేజ్‌మెంటే నిర్ణయించాలన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకున్నాం.’అని డస్కాటే పేర్కొన్నాడు.జస్‌ప్రీత్ బుమ్రా సుదీర్ఘ కాలంగా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతని విలక్షణమైన బౌలింగ్ శైలి కారణంగా వెన్నుపై అదనపు భారం పడుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు జట్టుకు దూరమైన బుమ్రా.. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఈ పర్యటనలో కెప్టెన్‌గా జట్టు బౌలింగ్ భారాన్ని ఒక్కడే మోసాడు. ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో గాయపడిన అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేదు. మళ్లీ ఐపీఎల్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. నాలుగో టెస్ట్‌లో బుమ్రా పేస్ దారుణంగా పడిపోయింది. చీల మండ గాయంతో కూడా అతను ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే అతను ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

జస్ప్రీత్ బుమ్రా 6 డిసెంబర్ 1993లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు.

బుమ్రా భారత క్రికెట్ జట్టులో ఎప్పుడు అరంగేట్రం చేశారు?

బుమ్రా 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టుకు ప్రథమ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగారు.

Read hindi news:

Read Also:

https://vaartha.com/abhimanyu-easwaran-abhimanyu-easwarans-father-ranganathan-easwaran-is-angry-with-the-behavior-of-bcci-selectors/sports/524254/

BCCI decision on Bumrah BCCI selection committee Breaking News Bumrah workload management India vs England Tests Jasprit Bumrah news latest news Team India pacer updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.