📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Basavatarakam Hospital: బసవతారకం ఆసుపత్రికి నాట్స్‌ భారీ విరాళం

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆద్యంతం తెలుగు సామాజిక సేవకు అంకితమై ఉంటుంది. తాజాగా ఈ సంస్థ గొప్ప సేవాభావాన్ని మరోసారి చాటిచెప్పింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో అట్టహాసంగా నిర్వహించిన 8వ తెలుగు సంబరాల్లో నాట్స్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భారీగా ₹85 లక్షల విరాళాన్ని ప్రకటించి అందరికీ ప్రేరణగా నిలిచింది.ఈ మేరకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ఛైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ, నాట్స్‌ సభ్యులు ఈ విరాళం చెక్కును బాలకృష్ణకు అందజేశారు. ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ లిటరేచర్ కమిటీ రూపొందించిన ‘శక పురుషుడు’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ నుంచి జయసుధ, మీనా, శ్రీలీల వంటి సినీ నటులను సత్కరించారు.

ముఖ్య అతిథులుగా

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, సీనియర్ హీరో వెంకటేశ్, ఏపీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, గౌతు శిరీష, వసంత కృష్ణప్రసాద్, చదలవాడ అరవిందబాబులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరా బాలకృష్ణ (Vasundhara Balakrishna) హాజరయ్యారు. నాట్స్ తరఫున వీరికి జీవిత సాఫల్య పురస్కారంను అందజేసారు. తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడానికి, సేవా కార్యక్రమాల్లో తమ పాత్రను గుర్తించి ఈ పురస్కారం ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

అనేక కార్యక్రమాలు

ఈ వేడుకల్లో తెలుగు కళా సాంస్కృతిక ప్రదర్శనలు, కుటుంబ సమాగమాలు, విద్యా వర్క్‌షాప్‌లు, ఆరోగ్య అవగాహన సెషన్లు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వాసులు పెద్దఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. నాట్స్ (NATS) సేవా స్పూర్తికి ఇది గొప్ప నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను ఎవరు స్థాపించారు?

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 93వ జయంతి. మా హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది 93వ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని CEO, COO, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీ నందమూరి తారక రామారావు & శ్రీమతి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఉన్నాయి?

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2000 సంవత్సరంలో స్థాపించబడింది, దీని లక్ష్యం సరసమైన క్యాన్సర్ సంరక్షణను అందించడం. ఈ ప్రయాణం 100 పడకల సాధారణ సౌకర్యంతో ప్రారంభమైంది. అయితే, రోగుల పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ఆసుపత్రి ఇప్పుడు క్రమంగా 500 పడకలకు విస్తరించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jagan Chittoor Tour : జగన్ ను అడ్డుకున్న ఎస్పీ

Balakrishna BasavatarakamHospital Breaking News latest news NATS Telugu News TeluguSambaralu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.