📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Barack Obama: ఒబామా అరెస్టు.. ఏఐ వీడియోపై ట్రంప్ నవ్వులు

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచే ట్రంప్ ఏదీ
చేసినా అది మీడియాలో సంచలనంగా మారుతున్నది. నిత్యం ఏదో ఒక వార్తతో ట్రంప్ (Trump)
మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) ను అరెస్టు చేసినట్లు అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఓ వీడియోను విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓవల్ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
(ఎఫ్బీఐ) అధికారులు ఒబామాను అరెస్టు చేస్తున్నట్లు ఉన్న వీడియోను ట్రంప్ తన సోషల్
మీడియా ట్రూత్లో పోస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదంటూ ఒబామాపై
విమర్శలు గుప్పించారు.


ఒబామా చేతికి సంకెళ్లు.. ట్రంప్ నోటిలో నవ్వులు..


ట్రంప్, ఒబామా (Barack Obama) ఓవల్ ఆఫీసులో మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా ఎఫ్బీఐ అధికారులు అక్కడికి వచ్చి, ఒబామాను అరెస్టు చేస్తారు. చేతికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తారు. ఆ సమయంలో ట్రంప్ హుషారుగా నవ్వుతూ (Trump smiles brightly) కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ట్రంప్ దుందుడుకు చర్యలపై ఇప్పటికే పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని దేశాలు అయితే ట్రంప్ పై ట్రేడ్వార్కు దిగాయి. దేశాలమధ్య స్నేహసంబంధాలను ట్రంప్
దెబ్బతీస్తున్నారంటే విమర్శిస్తున్నారు. వీటిని ఏమీ పట్టించుకోకుండా ట్రంప్ తన సంచలన
నిర్ణయాలను తీసుకుంటూనే ఉన్నారు. ట్రూతోపోస్టులో తన పోస్టింగ్ వ్యాఖ్యల్ని ఆపడం
లేదు . 

ఒబామా అరెస్టు అయినట్లుగా వైరలవుతున్న వీడియో నిజమా?


కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న బరాక్ ఒబామా అరెస్టు వీడియో ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ (AI-generated Deepfake). ఇది వాస్తవం కాదు. అధికారికంగా ఒబామాపై ఎటువంటి అరెస్టు లేదా కేసు లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read also: America: ఇకపై వీటి ఆధారంగానే హెచ్ -1బీ వీసా జారీ!

AI Fake News Barack Obama Arrest Fake Video Breaking News latest news social media misinformation Trump on Obama Arrest Trump Reaction US Politics 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.