Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన ప్రవాసంపై తొలిసారిగా మాట్లాడారు. తన ప్రాణాలను, తన చుట్టూ ఉన్నవారి భద్రతను కాపాడేందుకు దేశం విడిచి పెట్టాల్సి వచ్చిందని, అదొక తప్పనిసరి అవసరం’గా మారిందని ఆమె స్పస్టం చేశారు. తన పాలనను కూల్చివేసిన విద్యార్థుల నిరసనలను ‘హింసాత్మక తిరుగుబాటు’గా అభివర్ణించిన ఆమె, భద్రతా బలగాలు కాల్పులు జరపాలని తాను ఆదేశించానన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాల వెల్లడి బ్రిటిష్ మీడియా సంస్థ ‘ది ఇండిపెండెంట్ ‘కు ఇంటర్వ్యూలో హసీనా పలు కీలక విషయాలు వెల్లడించారు. నేను అక్కడ ఉండి నా ప్రాణాలకే కాదు, నా చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదం వాటిల్లేది’ అని హసీనా అన్నారు.
Read also: PM Modi : భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది : ప్రధాని మోదీ
Bangladesh: నేనెందుకు బంగ్లాదేశ్ ను వదలివచ్చానంటే.. షేక్ హసీనా
Bangladesh: గత ఏడాది ఆగస్టు 5న ఆమె దేశం విడిచి భారత్ కు వచ్చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ (Bangladesh) లో తన అవామీ లీగ్ పార్టీపై నిషేదం ఉన్నప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అది బూటకు విచారణ ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసిటి) తనపై విచారణను హసీనా బూటకపు విచారణగా కొట్టిపారేశారు. నన్ను రాజకీయంగా అంతం చేయడానికే, ఎన్నిక కాని ప్రభుత్వం నా రాజకీయ ప్రత్యర్థులతో ఈ బూటకపు కోర్టును నడుపుతోంది అని హసీనా ఆరోపించారు. ఈ విచారణలో తనకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోనని, భయపడబోనని అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: