📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

Author Icon By Vanipushpa
Updated: December 19, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ(Osman Hadi death) మరణవార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనా కు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టడమే కాకుండా, ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఓస్మాన్ హాదీపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు.

Read Also: Australia terror plot :ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం

Bangladesh

అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి, నిప్పు

హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్‌షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి, నిప్పు పెట్టారు. అలాగే షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా, దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు.

భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు

ఛటోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఈ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ఓస్మాన్ హాదీ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. శనివారం (డిసెంబర్ 20) నాడు దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినం ప్రకటించారు. హాదీ హంతకులను విడిచిపెట్టబోమని, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Bangladesh Protests Breaking News in Telugu Google News in Telugu Latest In telugu news law and order crisis political unrest in Bangladesh public protests South Asia news Telugu News Today violent demonstrations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.