బంగ్లాదేశ్‌లో(Bangladesh) మళ్లీ ఉద్రిక్తతలు ఉత్పన్నమయ్యాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పై నమోదైన కేసులపై కోర్టు తీర్పు ఈ నెల 17న వెలువడనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం రాజధాని ఢాకాలో భద్రతను కట్టుదిట్టం చేసింది.
Read Also: Mithun Reddy: పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి
ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చుట్టూ పోలీసు బందోబస్తు మరింతగా పెంచగా, కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ, రాజధానిలో లాక్‌డౌన్ పాటించాలని ప్రజలను కోరింది. దాంతో ఢాకాలోని ప్రధాన మార్గాల్లో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి, వాహనాలు మరియు ప్రయాణికులపై కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా, చట్టం మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు, బోర్డర్ గార్డ్ దళాలను పెద్ద ఎత్తున రంగంలోకి దించారు. తీర్పు రోజు సమీపిస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: