📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Bangladesh: ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Author Icon By Pooja
Updated: December 20, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో(Bangladesh) ఓ యువ రాజకీయ నాయకుడి హత్య అనంతరం చెలరేగిన హింస దేశ రాజధాని ఢాకాను వణికించింది. ఆగ్రహంతో రగిలిన వందలాది మంది ఆందోళనకారులు రాజధానిలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ దినపత్రికలైన ‘ప్రొథొమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’ కార్యాలయాలపై పెట్రోల్ బాంబులతో దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగించారు.

Read Also: Sangareddy Crime: కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

Violence in Dhaka; attacks on newspaper offices.

ఈ దాడుల ప్రభావంతో 27 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ప్రొథొమ్ ఆలో’ పత్రిక తొలిసారిగా తన ముద్రిత సంచికను నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా కారణాలతో ఆన్‌లైన్ ప్రచురణను కూడా తాత్కాలికంగా ఆపినట్లు సంస్థ వెల్లడించింది.

అసలు కారణం ఇదే..

స్థానిక యువజన నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది (32) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంలో, డిసెంబర్ 6న గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 12న మృతి చెందారు.

ఈ వార్త వెలుగులోకి రాగానే ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమ నాయకుడి హత్యకు కొన్ని మీడియా కథనాలే కారణమని ఆరోపిస్తూ, భారీ సంఖ్యలో ఢాకా వీధుల్లోకి వచ్చి హింసకు పాల్పడ్డారు.

జర్నలిస్టుల్లో భయాందోళన

ఈ ఘటనపై ‘ప్రొథొమ్ ఆలో’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సజ్జద్ షరీఫ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ప్రాణభయంతో కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇది కేవలం ఒక పత్రికపై దాడి కాదని, దేశంలోని పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జాతీయ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరిగిన ఈ హత్య, అనంతర హింసాత్మక (Bangladesh) ఘటనలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దేశంలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, శాంతిభద్రతల లోపాన్ని ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

DhakaViolence Google News in Telugu JournalistSafety Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.