బంగ్లాదేశ్(Bangladesh) లో యువనేత ఉస్మాన్ హాదీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హత్యలో అక్కడి ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మెడకే చుట్టుకుంటోంది. హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలో కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు అతడి సోదరుడు ఆరోపణలు చేశాడు. హదీని మీరే (యూనస్ ను ఉద్దేశిస్తూ) చంపేశారంటూ వ్యాఖ్యానించాడు.
Read Also: Trump: అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?
ఈ హత్య ఘటనను వాడుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన సోదరుడి హత్యపై వెంటనే విచారణ జరిపి హంతకులను పట్టుకోవాలని కోరాడు. హాదీకి న్యాయం చేయకపోతే మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ ను విడిచి పారిపో వాల్సిన పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించాడు. గతేడాది మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారి పోయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో హాదీ కీలక పాత్ర పోషించారు. తాజాగా అతడి హత్య వెనుక యూనస్ ప్రభుత్వం ఉందని అనుమానాలు రావడం దుమారం రేపుతోంది.
అమెరికా, జర్మనీ ఎంబసీలు మూత
బంగ్లాదేశ్(Bangladesh) లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 25న క్రిస్మస్ రోజున బంగ్లాదేశ్ లో భారీ ఎత్తున నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం రాజధాని ఢాకా సహా కీలక నగరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించింది. క్రిస్మస్ వేడుకలు జరుపుకునే చర్చిల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, అంతర్గత భద్రతపై నమ్మకం లేకపోవడంతో విదేశీ రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. కేవలం అమెరికా, జర్మనీ మాత్రమే కాకుండా ఇరత యూరోపియన్ దేశాలు కూడా తమ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: