📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

Author Icon By Anusha
Updated: February 15, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ (Bangladesh) లో, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఈ నెల 17న అధికారికంగా కొలువుదీరనుంది. ప్రభుత్వానికి ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు.ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ పార్లమెంటు హౌస్‌లోని సదరన్ ప్లాజాలో నిర్వహించనున్నారు.

Read Also: PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ.2,000 జమకు కేంద్రం సిద్ధం

Bangladesh: Tariq Rahman takes oath.. Invitation to Prime Minister Modi

అధికారికంగా భారత్ ధ్రువీకరించాల్సి ఉంది

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 13 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇందులో భారత్‌తో సహా చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, ఖతార్, శ్రీలంక, నేపాల్ దేశాలు ఉన్నాయి.బంగ్లాదేశ్‌ (Bangladesh) లో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం వచ్చాక భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆహ్వానం అందడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా ఆయన తరఫున ఎవరైనా హాజరవుతారా తెలియాల్సి ఉంది. బంగ్లాదేశ్ ఆహ్వానంపై అధికారికంగా భారత్ ధ్రువీకరించాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

bangladesh new government latest news Tarique Rahman Prime Minister Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.