📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Bangladesh: షేక్ హసీనాకు మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఆ దేశం నుంచి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటున్నా ఆమెపై కేసుల కొనసాగింపు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు మరణశిక్ష మరోవైపు జైలు శిక్షలు వేస్తూనే ఉన్నాయి ఆ దేశపు కోర్టులు. ఈ పరిస్థితుల్లో నిజంగా హసీనా తన స్వదేశానికి వెళ్తే.. బతకనిస్తారా అనే సందేహం కలగకమానదు. ప్రస్తుతం ఆమెపై భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్ లోని ఓ కోర్టు పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Read Also: Brazil: సింహాన్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాడు.. ప్రాణాలనే కోల్పోయాడు

Bangladesh Sheikh Hasina sentenced to five years in prison in another case

అవినీతి కేసుల్లో హసీనాకు సంబంధించిన నాల్గవ తీర్పు

ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్ల జైలుశిక్ష, ఆమె మేనకోడలు బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్దిక్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును ది డైలీ స్టార్ నివేదించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జ్ కోర్టు-4 న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. అవినీతి నిరోధక కమిషన్ (ఎసిసి) దాఖలు చేసిన అవినీతి కేసుల్లో హసీనాకు సంబంధించిన నాల్గవ తీర్పు ఇది అని నివేదక పేర్కొంది. పుర్చాచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపనలపై ఎసిసి జనవరి 12,14 మధ్య దాని ఢాకా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్-2లో ఆరు వేర్వేరు కేసులు దాఖలు చేసింది.

బంధువుల కోసం భూమిని పొందారు.అవినీతి నిరోధక సంస్థ ప్రకారం, హసీనా, సీనియర్ రాజుక్ అధికారులతో కలిసి, పుర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ లోని సెక్టార్ 27లోని దౌత్యమండలంలో 10 స్టోరీస్ (7,200 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఆరు ప్లాట్లను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుత నిబంధనల ప్రకారం వారు అనర్హులు అయినప్పటికీ, ఆమె కుమూరుడు సజీబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ పుతుల్ తో సహా ఆమె బంధువుల కోసం ఈ భూమిని పొందారని ఢాకా ట్రి బ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

మూడు అవినీతి కేసులు.. 21 సంవత్సరాల జైలు శిక్ష

బంగ్లాదేశ్ (Bangladesh) కోర్టు హసీనాకు మూడు అవినీతి కేసుల్లో 21 సంవత్స రాల జైలు శిక్ష విధించిందని స్థానిక మీడియా నివేదించింది. ప్రభుత్వ అధీనంలోని బిఎస్ ఎస్ వార్తా సంస్థ ప్రకారం, పుర్బాచోల్ లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈ మూడుకేసులు నమోదయ్యాయి. నిందితురాలిని ఇంకా అరెస్టు చేయకపోవడంతో, ఆమె గౌర్హాజరీలో విచారణ జరిగినందున, న్యాయమూర్తి ఆమె గైర్హాజరీలో తీర్పు వెలువరించారు. ఆమెకు మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసిటి) జులై 2024 ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించిన తర్వాత షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

bangladesh BangladeshPolitics CorruptionCase FiveYears FormerPrimeMinister Google News in Telugu JailSentence Latest News in Telugu LegalTroubles PoliticalNews SheikhHasina Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.