బంగ్లాదేశంలో జరిగిన విమాన ప్రమాదం (Bangladesh plane crash)లో 20 మంది విద్యార్థులు మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం ఢాకాలోని ఓ పాఠశాల (A school in Dhaka)పై కూలింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు పైలెట్ ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. నిన్న అనగా సోమవారం చైనాలో తయారు చేసిన శిక్షణా విమానం ఎఫ్-7 జీబీఐ జెట్ టేకాఫ్అ యిన కొద్దిసేపటికి పైలెట్ నియంత్రణ కోల్పోయారు. ఫలితంగా మరో 8 నిమిషాల్లోనే గగనతలం నుంచి నేరుగా స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్పై ఫైటర్ జెట్ కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారలు చెప్పారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మరణించగా (20 people died), 171మందికిపైగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయని, పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగ అలుముకుందని స్థానికులు తెలిపారు. ఆగ్నికీలలు వ్యాపించడంతో పాఠశాలలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ విద్యాసంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకూ సుమారు 2వేలమంది విద్యార్థులు ఉంటారని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో పలువురిలో ఆందోళన పెరుగుతున్నది. ఇక్కడ తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బంగ్లా తాత్కాలిక సారధి మహమ్మద్ యూనస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించారు. ఎక్స్ వేదికగా యూనస్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఆవేదనను చెందారు. ప్రమాదంపై వైమానిక దళం ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇటీవల తరచూ విమానప్రమాదలు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశంలో అహ్మమాదాబాద్ దుర్ఘటన విషాదం మరవకముందే ఈ ఘటన జరగడం పలువురిని ఆందోళన పరుస్తున్నది. విమాన ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు .
బంగ్లాదేశ్‌లో విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది?
ఈ విమాన ప్రమాదం బంగ్లాదేశ్ ఢాకాలోని నగరంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. శిక్షణా విమానం ఎఫ్-7 జీబీఐ జెట్ టేకాఫ్అ యిన కొద్దిసేపటికి పైలెట్ నియంత్రణ కోల్పోయారు.
ఈ ప్రమాదంలో ఎంతమంది విద్యార్థులు మరణించారు?
మొత్తం 20 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Benjamin Netanyahu: అనారోగ్యానికి గురైన నెతన్యాహు..