📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Bangladesh: రేపు క్రిస్మస్ వేళ.. మూతపడ్డ జర్మనీ అమెరికా ఎంబసీలు 

Author Icon By Saritha
Updated: December 24, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 25న క్రిస్మస్ రోజున బంగ్లాదేశ్ లో భారీ ఎత్తున నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ దేశంలోని బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ అనే ఇస్లామిక్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందూవులు, క్రైస్తవులు మైనార్టీలుగా ఉన్నారు. (Bangladesh) ఇప్పటికే బంగ్లాదేశ్ లోని ఇండియన్ ఎంబసీ దగ్గర పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే అమెరికా, జర్మనీ దేశాలు రేపు ఎంబసీ మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి.

Read Also: Trump: అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు.. ఎందుకనగా?

On the occasion of Christmas tomorrow, the German and American embassies are closed.

రేపు ఏం జరగబోదోంది?

బంగ్లాదేశ్ లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రాజకీయ మతపరమైన ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదు. (Bangladesh) ప్రత్యేకించి, అరెస్టయిన కృష్ణ దాస్ విడుదల కోరుతూ గిరిజన, మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీనికి వ్యతిరేకంగా కొన్ని తీవ్రవాద, ఇతర అతివాద గ్రూపులు కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. క్రిస్మస్ పండుగ కావడంతో, క్రైస్తవ మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది బంగ్లాదేశ్ లో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ పార్టీ. 1971 విముక్తి యుద్ధం సమయంలో పాకిస్థాన్ కు మద్దతు ఇచ్చిందనే ఆరోపణలతో గతంలో ఈ పార్టీపై నిషేధం ఉండేది. షేక్ హసీనా ప్రభుత్వం వెళ్లి పోయిన తర్వాత ఈ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. ఇప్పుడు ఈ పార్టీ నాయకులు దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరు రాజ్యాంగానిన ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అనవసరంగా బయటకు రావద్దని, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తన పౌరులను అమెరికా, (America) జర్మనీ దేశాలు హెచ్చరించాయి.

చర్చిల వద్ద భారీ బందోబస్తు

బంగ్లాదేశ్ ప్రభుత్వం రాజధాని ఢాకా సహా కీలక నగరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించింది. క్రిస్మస్ వేడుకలు జరుపుకునే చర్చిల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, అంతర్గత భద్రతపై నమ్మకం లేకపోవడంతో విదేశీ రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. కేవలం అమెరికా, జర్మనీ మాత్రమే కాకుండా ఇరత యూరోపియన్ దేశాలు కూడా తమ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

bangladesh Christmas 2025 Embassy Closures German Embassy Latest News in Telugu Political Tensions Religious Minorities Telugu News US Embassy Violence Alerts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.