ఆపరేషన్ సిందూర్ యుద్ధంతో భారత్-పాక్ లమధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (S. Jaishankar) బంగ్లాదేశ్ లో పర్యటించారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఢాకా వెళ్లారు. నాలుగు గంటల పాటు బంగ్లాదేశ్ లో పర్యటించారు. జైశంకర్ పర్యటనలో భాగంగా పలువురిని కలిశారు.
Read also: New Zealand: 2026కు న్యూజిలాండ్ స్వాగతం
Bangladesh
తొలిసారిగా పాక్ నేతను కలిసిన జైశంకర్
ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ ను జైశంకర్ కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా భారతదేశంతో ఖలీదా జియా వ్యవహరించిన తీరును గుర్తుచేశారు. ప్రధాని మోడీ పంపించన సంతాప లేఖను అందజేశారు. ఇక ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ను కూడా కలిశారు. కొద్దిసేపు ఇద్దరూ సమావేశం అయ్యారు. ఆపరేషన్
సిందూర్ తర్వాత పాకిస్తాన్ నేతలను ఇలా కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు చెప్పుకున్నట్లు సమాచారం. ఖలీదా జియా బంగ్లాదేశ్ కు మూడుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేశారు. బీఎన్పీ అధినేత్రిగా ఉన్నారు. తీవ్ర అనారోగ్యంగా 80 ఏళ్ల వయసులో డిసెంబర్ 30, 2025న మరణించారు. బుధవారం లక్షలాది మంది జనాల మధ్య ఖలీదా జియా అంత్యక్రియలు జరిగిన విషయం విధితమే. కాగా ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవికి జిలా పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ పోటీచేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: