📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Bangladesh: హసీనా అప్పగింతపై ఇంటర్ పోల్

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) ఇటీవల ట్రైబ్యూనల్ కోర్టు ఉరిశిక్ష విధించడంతో ఆమెను ఏవిధంగానైనా స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆమె అప్పగింతపై ఇంటర్ పోల్ను ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నది. మానవత్వాన్ని మరచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. 

Read Also: New Startup Fund: స్టార్టప్‌ల కోసం భారీగా ₹1000Cr ఫండ్

ఈ క్రమంలోనే ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్ విముఖత చూపస్తోంది. దీంతో ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనా, బంగ్లా మాజీ హోంమత్రి ఆసదుజ్జమాన్ ఖాన్ అప్పగింతపై ఇంటర్ పోల్ను ఆశ్రయించాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అక్కడి విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు వెల్లడించాయి.

Bangladesh Interpol on Hasina’s extradition

రెడ్ నోటీసలు జారీకి సన్నాహాలు

దేశం విడిచి పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ లపై రెడ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్ పోల్ను అభ్యర్థించడానికి బంగ్లా ప్రాసిక్యూటర్ గాజీ తమీమ్ సన్నాహాలు చేపట్టారని బంగ్లాదేశ్ దినపత్రిక ది ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్  నివేదించింది. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ నోటీసులు (Notices) జారీ చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఇంటర్ పోల్కు అరెస్టు వారెంట్ తో పాటు దరఖాస్తు సమర్పించినట్లు తెలిపింది. దేశం విడిచి పారిపోయిన నిందితురాలని, అందుకే ఆమెను తమకు అప్పగించాలని ఆ దేశ విదేశాంగశాఖ ఒత్తిడి తెస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bangladesh politics extradition request Google News in Telugu international police cooperation. Interpol Latest News in Telugu political asylum; Sheikh Hasina Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.