బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina) ఇటీవల ట్రైబ్యూనల్ కోర్టు ఉరిశిక్ష విధించడంతో ఆమెను ఏవిధంగానైనా స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆమె అప్పగింతపై ఇంటర్ పోల్ను ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నది. మానవత్వాన్ని మరచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.
Read Also: New Startup Fund: స్టార్టప్‌ల కోసం భారీగా ₹1000Cr ఫండ్
ఈ క్రమంలోనే ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్ విముఖత చూపస్తోంది. దీంతో ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనా, బంగ్లా మాజీ హోంమత్రి ఆసదుజ్జమాన్ ఖాన్ అప్పగింతపై ఇంటర్ పోల్ను ఆశ్రయించాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అక్కడి విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు వెల్లడించాయి.

రెడ్ నోటీసలు జారీకి సన్నాహాలు
దేశం విడిచి పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ లపై రెడ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్ పోల్ను అభ్యర్థించడానికి బంగ్లా ప్రాసిక్యూటర్ గాజీ తమీమ్ సన్నాహాలు చేపట్టారని బంగ్లాదేశ్ దినపత్రిక ది ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ నోటీసులు (Notices) జారీ చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఇంటర్ పోల్కు అరెస్టు వారెంట్ తో పాటు దరఖాస్తు సమర్పించినట్లు తెలిపింది. దేశం విడిచి పారిపోయిన నిందితురాలని, అందుకే ఆమెను తమకు అప్పగించాలని ఆ దేశ విదేశాంగశాఖ ఒత్తిడి తెస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: