గతకొన్ని నెలలుగా బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడికిపోతున్నది. రిజర్వేషన్ల విషయంలో ఏర్పడ్డ విభేదాలతో విద్యార్థినేత ఎ ‘రీఫ్’ ఉస్మాన్ హదీ నాయకత్వంలో దేశంలో కనీవినీ, ఎరుగని రీతిలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో ఆ దేశమాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు. దీంతో ఆమె మనదేశంలోనే ఆశ్రయం పొందుతున్న విషయం విధితమే. తాజాగా బంగ్లాదేశ్ (Bangladesh) లో కొనసాగుతున్న ఉద్రిక్తలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు.
Read Also: America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్
గతేడాది దేశంలో జరిగిన మారణహోమాన్ని ఆపడానికే తాను దేశం వీడి భారత్ కు వచ్చానని.. భయపడి కాదని అన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో ఉద్రిక్తతలు చల్లారట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి బంగ్లాలో హింస పెరిగిపోయిందని ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. అక్కడ చట్టాలు ఏవీ అమల్లో లేవని..దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు భారత్-బంగ్లా బంధాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు.
ఉద్దేశపూర్వకంగానే యూనస్ భారత్ కు వ్యతిరేకంగా చర్యలు
అల్లర్లలో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ అనే మైనారిటీ యువకుడిని ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపి,
నిప్పంటించడంపై హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల భద్రను కాపాడడంలో తాత్కాలిక
ప్రభుత్వం విఫలమయ్యిందని ఈ ఘటనతో స్పష్టమయ్యిందన్నారు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే
భారత్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని కానీ పైకి మాత్రం భారత్ తో స్నేహం కోరుకుంటున్నట్లు
బూటకపు మాటలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటువంటి ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా
భారత్-బంగ్లా మధ్య ఉన్న బంధాన్ని బలహీపరచలేవన్నారు. షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యలో ప్రధాన
నిందితుడిగా భావిస్తున్న పైసల్ కరీం మసూద్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: