Bangladesh Hindu youth suicide : బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు మరో విషాద ఘటనకు దారితీశాయి. కేవలం 500 టాకాల అప్పు చెల్లించలేదన్న కారణంతో అవమానానికి గురైన 19 ఏళ్ల హిందూ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన Bangladesh లోని సునమ్‌గంజ్ జిల్లా దిరాయ్ ఉపజిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని జాయ్ మహపాత్రగా గుర్తించారు.
విషం తాగిన జాయ్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో Sylhet లోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అతడు మృతి చెందాడు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, (Bangladesh Hindu youth suicide) జాయ్ ఓ కిరాణా దుకాణ యజమాని అమీరుల్ ఇస్లాం వద్ద 5,500 టాకాలకు మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. ముందుగా 2,000 టాకాలు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వారానికి 500 టాకాల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే చివరి వాయిదా చెల్లింపులో కొంత ఆలస్యం జరిగింది.
డబ్బు చెల్లించేందుకు గురువారం దుకాణానికి వెళ్లిన జాయ్‌ను అమీరుల్ ఇస్లాం కొట్టి, తీవ్రంగా అవమానించి అతని మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవమానాన్ని తట్టుకోలేక జాయ్ అదే రోజు సాయంత్రం విషం తాగాడు.
“నా కొడుకును డబ్బుల కోసం దుకాణంలోనే అవమానించారు, ఫోన్ లాక్కున్నారు. ఆ మనస్తాపమే అతని ప్రాణాలు తీసింది” అంటూ జాయ్ తల్లి షెల్లీ మహపాత్ర కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనపై సమాచారం అందిందని, ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిరాయ్ పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: