బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా (Sheikh Hasina) మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నూతన సంవత్సర సందేశంలో భాగంగా గురువారం ఆమె స్పందిస్తూ.. తీవ్ర అవినీతి, అసత్యాలు, స్వప్రయోజనాలతో ప్రస్తుత పాలకులు దేశాన్ని చీకటిలోకి నెట్టివేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అవామీ లీగ్ పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో షేక్ హసీనా సందేశాన్ని పంచుకుంది. ‘దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్న వారి ముసుగులు, దుర్మార్గపు ముఖాలు ఇప్పటికే ప్రజల ముందు బట్టబయలయ్యాయి. చట్టవిరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకున్న వారు, మిమ్మల్ని బందీలుగా పట్టుకుని అంతులేని అవినీతి, అబద్ధాలతో దేశాన్ని ఎలా చీకట్లోకి నెట్టారో మీరంతా చశారు’ అని హసీనా పేర్కొన్నారు.
Read also: Jairam Ramesh: భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్
Bangladesh
దేశ గౌరవాన్ని పెంచిన తన ప్రభుత్వం: హసీనా
‘మతం, వర్ణం, వర్గం, వృత్తి, జాతి అనే తేడా లేకుండా ఈ దేశం నిజంగా ప్రజలందరిదీ కావాలన్నదే నా కల, జీవితకాల పోరాట ఆకాంక్ష. కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సామరస్యం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలి’ అని హసీనా ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ప్రపంచ వేదికలపై దేశానికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడానికి అవిశ్రాంతంగా పనిచేసిందని, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రత్యేక గుర్తింపు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా 1971 విమోచన యుద్ధ వారసత్వం ప్రశ్నార్థకంగా మారాయని ఆమె ఆవేదన చెందారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బేధాభిప్రాయాలను పక్కనపెట్టి ఏకతాటిపై నిలిచారని ఆమె అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: