Press freedom Bangladesh : బంగ్లాదేశ్‌లో మీడియా స్వేచ్ఛపై ఆందోళనలు మరింత తీవ్రమవుతున్న వేళ, ప్రముఖ టీవీ ఛానెల్ గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ కార్యాలయంలో బెదిరింపుల ఘటన కలకలం రేపింది. ప్రముఖ పత్రికలైన ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు జరిగిన కొద్ది రోజులకే ఈ తాజా ఘటన వెలుగులోకి వచ్చింది.
వార్తా కథనాల ప్రకారం, ఇటీవల కొన్ని యువకులు ఢాకాలోని తేజ్గావ్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ టీవీ కార్యాలయానికి వెళ్లి, ఆ ఛానెల్ హెడ్ ఆఫ్ న్యూస్ నజ్‌నిన్ మున్నీను తొలగించాలని మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించారు. తమ డిమాండ్‌ను అంగీకరించకపోతే, ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాల్లాగే ఇక్కడ కూడా నిప్పు పెడతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్నీ అవామీ లీగ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.
ఈ యువకులు తాము యాంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్ ప్రతినిధులమని చెప్పుకున్నప్పటికీ, ఆ సంస్థ ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సంస్థ అధ్యక్షుడు రిఫాత్ రషీద్ స్పందిస్తూ, ఈ ఘటనలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read also: China: ఏఐ పురోగతి ఒక వైపు.. ప్రభుత్వ ఆందోళన మరో వైపు
డిసెంబర్ 21న ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది, షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో, మీడియా సంస్థలపై దాడులు జరిగిన మూడు రోజులకే జరగడం గమనార్హం.
ఈ విషయాన్ని నజ్‌నిన్ మున్నీ స్వయంగా (Press freedom Bangladesh) ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. “7 నుంచి 8 మంది వ్యక్తులు కార్యాలయానికి వచ్చి, నేను ఉద్యోగం వదిలేయకపోతే కార్యాలయాన్ని కాల్చేస్తామని బెదిరించారు” అని ఆమె పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను కార్యాలయంలో లేనని, ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కలసి, షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంపై గ్లోబల్ టీవీ సరైన కవరేజ్ ఇవ్వలేదని వారు ఫిర్యాదు చేశారని మున్నీ తెలిపారు. తనను 48 గంటల్లో తొలగించాలంటూ రాతపూర్వక హామీ ఇవ్వాలని కూడా ఒత్తిడి చేసినట్లు చెప్పారు. అయితే, మేనేజింగ్ డైరెక్టర్ ఆ డిమాండ్‌ను తిరస్కరించారు.
తనపై వచ్చిన రాజకీయ ఆరోపణలను మున్నీ ఖండిస్తూ, “నేను అవామీ లీగ్‌తో సంబంధం ఉన్నట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేరు” అని స్పష్టం చేశారు. బెదిరింపుల మధ్య కూడా మౌనం పాటించబోనని ఆమె తేల్చి చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: