BNP chief Khaleda Zia : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి రాజకీయాల్లో శోకం

Read Time:  1 min
BNP chief Khaleda Zia
BNP chief Khaleda Zia
FONT SIZE
GET APP

BNP chief Khaleda Zia : బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు Begum Khaleda Zia మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఢాకాలోని అపోలో (ఎవర్కేర్) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పార్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఉదయం 6 గంటల సమయంలో, ఫజర్ నమాజ్ అనంతరం ఆమె కన్నుమూశారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు.

ఖలీదా జియా 1991లో జరిగిన స్వేచ్ఛాయుత, న్యాయమైన సాధారణ ఎన్నికల్లో గెలిచి బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 1996, 2001 సంవత్సరాల్లో కూడా ఆమె ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. దేశ రాజకీయాల్లో బలమైన ప్రతిపక్ష స్వరంగా ఆమె గుర్తింపు పొందారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

1981లో భర్త, అప్పటి అధ్యక్షుడు జియౌర్ రహ్మాన్ (BNP chief Khaleda Zia) హత్య అనంతరం ఖలీదా జియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1982లో బీఎన్‌పీలో సాధారణ సభ్యురాలిగా చేరి, 1983లో ఉపాధ్యక్షురాలిగా, 1984లో పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పటి సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏడు పార్టీ కూటమిని ఏర్పాటు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

ఆరోగ్య సమస్యల కారణంగా నవంబర్ 23న ఆమె ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియాతో పాటు లివర్ సిరోసిస్, షుగర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డిసెంబర్ 12న ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో చివరకు మృతి చెందారు.

ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.