📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Muhammad Yunus: భారత్ కు బంగ్లాదేశ్‌ నుంచి ముంచుకొస్తున్న ముంపు!

Author Icon By Vanipushpa
Updated: July 18, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌(Bangladesh)లో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌(Pakistan)తో ప్రమాదం ఉండగా.. మరో వైపు నుంచి భారత్‌(India)కు ప్రమాదం ముందుకొస్తోంది. పాకిస్తాన్, చైనా(China)తో మనకు శత్రత్వ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా పొరుగు దేశాల్లో గతకొన్ని నెలల వరకూ బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉండేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్లామిక్(Bangladesh Islamic) దేశంగా మారుతోంది. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, దేశంలోనూ, వెలుపలా ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. మహ్మద్ యూనస్(Muhammad Yunus) ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్ మతఛాందసవాద శక్తులను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గతంలో ఇండియాకు విదేయంగా ఉండే బంగ్లాదేశ్ ఇప్పుడు విభేదాలకు గురుతుంది. ప్రపంచ దేశాలతో బంగ్లాదేశ్‌ సంబందాలు పెరుగుతుండటంతో సరిహద్దులో భారతదేశం పట్ల ఆందోళనను పెంచింది. బంగ్లాదేశ్ నిపుణులు కూడా ఈ ప్రమాదం గురించి భారతదేశాన్ని హెచ్చరించారు.

Muhammad Yunus: భారత్ కు బంగ్లాదేశ్‌ నుంచి ముంచుకొస్తున్న ముంపు!

బంగ్లాదేశ్ ముస్లీం దేశంగా మారితే..

ఇప్పుడు పాకిస్తాన్ తరహాలోనే బంగ్లాదేశ్ నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు బంగ్లాదేశ్ భారత్ వైఖరిని తప్పుబడుతుంది. ద్వేషాన్ని పెంచుకుంటుంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇండియా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి భారతదేశాన్ని హెచ్చరించారు. మహ్మద్ యూనస్ ఇదే మార్గంలో కొనసాగితే, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉన్నందని ఆయన అన్నారు. ఇప్పటికే బంగ్లాదేశంలో హిందూవులపై, హిందూ దేవాలయాలపై దాడులు పెరుతున్నాయి. మొత్తం ప్రాంతంలో అస్థిరత వ్యాపిస్తుంది. భారతదేశం ముఖ్యంగా దీని ప్రభావానికి గురవుతుంది. ఎందుకంటే రెండు దేశాలకు ఉమ్మడి సంస్కృతి ఉంది.

భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులు
గత 11 నెలల్లో యూనుస్ ప్రభుత్వం భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులు చేసిందని షోయబ్ చౌదరి చెప్పారు. రాడికల్ ఇస్లాం నేపథ్యం ఉన్న పోలీసులు, సరిహద్దు గార్డు, కోస్ట్ గార్డులలో 17వేల మంది కొత్త వ్యక్తులను నియమించారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు ప్రసిద్ధి చెందిన బంగ్లాదేశ్, ఇప్పుడు మొహమ్మద్ యూనుస్ పాలనలో బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్‌గా మారుతుందని ఆయన వివరించారు. ఎలాంటి అర్హతలు చూడకుండా యూనస్ కేవలం ముస్లీం వ్యక్తులను సైన్యంలో ఉన్నత పదవుల్లో నియమించాడు. అందులో చాలామందికి సెల్యూట్ చేయడం కూడా రాదు. వారికి శిక్షణ ఇస్తున్నారు. యూనస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ మార్పులు బంగ్లాదేశ్ భద్రతా వ్యవస్థలో ఇస్లామీకరణ జరుగుతోందని అర్ధమవుతోంది.

బంగ్లాదేశ్ దేశానికి పాకిస్తాన్, టర్కీలతో దౌత్యసంబంధాలు

బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ఆ దేశాలు సాహాయం చేస్తున్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఉంది. మరోవైపు, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభావం కూడా బంగ్లాదేశ్‌లో పెరుగుతోంది. ఈ నెలలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ ముస్లిం NGOల సమూహానికి ఆతిథ్యం ఇచ్చింది. దీని గురించి మొహమ్మద్ యూనస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేయడమే ఈ సమావేశం ఉద్దేశ్యం అని స్పష్టంగా రాశారు.
బంగ్లాదేశ్‌లోనే కాకుండా దక్షిణాసియాలో ఎర్డోగన్ ప్రభావం
టర్కీ, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా నుండి ఇస్లామిక్ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఇంతలో, బంగ్లాదేశ్‌లో కూడా టర్కీ ప్రభావం పెరుగుతోంది. టర్కీ రక్షణ పరిశ్రమ కార్యదర్శి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌ను కలిశారు. దీనిలో టర్కీ బంగ్లాదేశ్‌కు కలిసి సైనిక పరికరాలను తయారు చేయాలని ప్రతిపాదించింది. ఎర్డోగన్ భావజాలాన్ని బంగ్లాదేశ్‌లోనే కాకుండా దక్షిణాసియాలో వ్యాప్తి చేయడానికి ఇది ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు .

 ముహమ్మద్ యూనస్ ఎవరు?
ముహమ్మద్ యూనస్ (జననం 28 జూన్ 1940) బంగ్లాదేశ్ బ్యాంకర్, ఆర్థికవేత్త మరియు రాజకీయవేత్త, అతను 2024 నుండి బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారుగా ఉన్నారు. ఆయన ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మరియు మైక్రోక్రెడిట్‌లో తన కృషికి ప్రసిద్ధి చెందారు. మైక్రోక్రెడిట్ అనేది చిన్న రుణాలు ఇవ్వడానికి ఒక పేరు. ఈ రుణాలు చాలా తక్కువ డబ్బు ఉన్న వ్యక్తులకు ఇవ్వబడతాయి.
ముహమ్మద్ యూనస్ ఒక వైద్యుడా?
ఆయన 1969లో వాండర్‌బిల్ట్ నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పట్టా పొందారు మరియు మరుసటి సంవత్సరం మిడిల్ టేనస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Dilip Vengsarkar: టీమిండియా జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే విజయం ఖాయం

#telugu News Bangladesh floods Brahmaputra river cross-border floods Disaster Management Bill flood alert India flood threat northeast India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.